Home » Gujarat
కాంగ్రెస్ నేత, తన సోదరుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి ‘యువరాజు’ అంటూ ప్రధాని మోదీ ఎద్దేవా పట్ల కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ధీటైన జవాబిచ్చారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సోదరుడు రాహుల్ గాంధీని యువరాజుగా సంబోధిస్తుండటంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజల కోసం రాహుల్ 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే, ప్రధాని మోదీ తన రాజభవనంలో కూర్చుని రైతుల దుస్థితిని పట్టించుకోవడం లేదన్నారు.
గుజరాత్లో గురువారం పార్సిల్ బాంబు పేలుడులో తండ్రీకూతుళ్లు మరణించిన ఘటనలో మరో షాకింగ్ కోణం వెలుగులోకి వచ్చింది. మృతుడి భార్య ప్రియుడే ఆ బాంబు వారి ఇంటికి పార్శిల్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
రాహుల్ గాంధీని 'భావి మహాత్ముడు'గా ప్రశంసిస్తూనే, గాంధీజీని 'కన్నింగ్' అంటూ గుజరాత్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, స్టార్ క్యాంపెయినర్ ఇంద్రనీల్ రాజ్గురు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
అదృష్టం వరించడం అంటే ఇదేనేమో? ఏకంగా ప్రధాని మోదీ ఒకనాడు పోటీ చేసిన సీటు టికెట్ ఓ సాధారణ యువకుడికి దక్కితే.. అదికూడా ఆయనకు చెప్పకుండానే మంజూరు చేస్తే..
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కీలక ఆపరేషన్ నిర్వహించి దేశంలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకిస్థాన్ భారీ కుట్రను ఛేదించింది. గుజరాత్ తీరంలో 86 కిలోల డ్రగ్స్ను గుజరాత్ తీరప్రాంతంలో అధికారులు ఆదివారంనాడు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ప్రధానులతో పాటు ఎందరో ప్రధానులను తాను చూశానని, కానీ బహిరంగంగా పచ్చి అబద్ధాలు చెప్పే ప్రధానిని చూడటం మాత్రం ఇదే మొదటిసారని అన్నారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పుల ఘటనలో ఇద్దరు షూటర్లు ఉపయోగించిన ఆయుధాలను, తూటాలను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్లోని తపతీ నదిలో వీటిని కనుగొని, వెలికి తీసినట్టు పోలీసులు మంగళవారంనాడు తెలిపారు.
గాడిద పాలు అమ్ముకుంటూ కోట్లల్లో ఆర్జిస్తున్న గుజరాత్ వ్యాపారి ధీరేన్ సోలంకీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు.
అసలే వేసవి కాలం.. ఆపై ట్రాఫిక్ పోలీసులు. ఎండలో పని. వారి కష్టం మామూలుగా ఉండదు. భానుడి భగభగల మధ్య విధులు నిర్వహించాలి. ఎండ వేడిని తట్టుకునేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలి. ఇంతటి కష్టం అనుభవించే ట్రాఫిక్ పోలీసుల బాధను అర్థం చేసుకుని గుజరాత్లోని వడోదర పోలీసులు పరిష్కారం కనుగొన్నారు. తమ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్(AC Helmet)లను అందిస్తున్నారు.