Gujarat: వివాహిత ఇంటికి పార్సిల్ బాంబు పంపిన మాజీ ప్రియుడు.. భర్త, కూతురి దుర్మరణం!
ABN , Publish Date - May 03 , 2024 | 09:35 PM
గుజరాత్‌లో గురువారం పార్సిల్ బాంబు పేలుడులో తండ్రీకూతుళ్లు మరణించిన ఘటనలో మరో షాకింగ్ కోణం వెలుగులోకి వచ్చింది. మృతుడి భార్య ప్రియుడే ఆ బాంబు వారి ఇంటికి పార్శిల్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లో (Gujarat) గురువారం పార్సిల్ బాంబు పేలుడులో తండ్రీకూతుళ్లు మరణించిన ఘటనలో షాకింగ్ కోణం వెలుగులోకి వచ్చింది. మృతుడి భార్య ప్రియుడే ఆ బాంబును వారి ఇంటికి పార్సిల్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఉదంతం స్థానికంగా కలకలానికి దారి తీసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జీతూభాయ్ హీరాభాయ్ వంజర్ (32) తన భార్య, పిల్లలతో కలిసి వడలిలో ఉంటున్నాడు. గురువారం అతడి ఇంటికి ఓ రిక్షావాల పార్సిల్ డెలివరీ చేసి వెళ్లాడు. పార్సిల్‌లోని టేప్ రికార్డర్‌ను స్వీఛ్ ఆన్ చేయగానే భారీ పేలుడు సంభవించి జీతూభాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అతడి కూతురు భూమిక (12) ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూసింది. జీతూభాయ్ మరో ఇద్దరు కూతుళ్లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగిన సమయంలో మృతుడి భార్య ఇంట్లో లేదని పోలీసులు తెలిపారు (Married Womans Lover Sends Parcel Bomb To Her House In Gujarat Husband, Daughter Killed).
Police Crime: పోలీసుల దాష్టికం.. 19 ఏళ్లుగా వేధింపులు.. చివరికి తీరని విషాదం
ఈ పేలుడు వెనక వివాహిత మాజీ ప్రియుడు జయంతీభాయ్ బాలూసింగ్ వంజర్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తితో తన ప్రియురాలి వివాహాన్ని సహించలేక ఆమె భర్తను చంపేందుకే నిందితుడు బాంబును పంపినట్టు పోలీసులు తెలిపారు. ఈ బాంబు కోసం అతడు రాజస్థాన్‌కు వెళ్లి కావాల్సినవి తెచ్చుకున్నటు తెలిపారు. జెలాటిన్ స్టిక్స్, డిటోనెటర్ వినియోగించి, స్విచ్ ఆన్ చేయగానే పేలుడు సంభవించేలా టేప్ రికార్డర్ బాంబు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ పార్సిల్ బాంబు తీసుకొచ్చిన రిక్షావాలాను సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.