Home » Gulf News
దళారుల మాటలు నమ్మి 30 రోజుల విజిట్ వీసాపై సౌదీ అరేబియాకు వచ్చిన తెలంగాణ వాసి నాలుగున్నరేళ్లు ఇక్కడే ఉన్నాడు. అనారోగ్య కారణాలతో మరణించిన అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
కువైత్ వెళ్లిన భర్త అక్కడి నుంచే నిఘా పెట్టి, వేధిస్తుండడాన్ని భరించలేని ఓ తల్లి తన ఇద్దరి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.
బంగ్లాదేశ్లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల కారణంగా అక్కడి మైనారిటీలైన హిందువుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవిభజన సమయంలో ఉన్న ప్రాంతాన్ని వదలి భారత్కు రాలేక ఎంతోమంది హిందువులు బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్థాన్)లోనే ఉండిపోయారు.
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 28 ఏళ్లుగా మాతృభూమి ముఖం చూడకుండా ఎడారి దేశంలో మగ్గిపోతున్నాడు ఓ తెలుగు ప్రవాసీ. గత ఏడాది పోలీసులకు చిక్కి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
ఉపాధి కోసం ఎడారి దేశం కువైట్కు వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయి, యజమాని వేధింపులకు గురవుతూ అనారోగ్యం బారిన పడిన నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ కుటుంబానికి ఎమ్మెల్యే, కలెక్టర్ భరోసా కల్పించారు.
దళారుల మాటలు నమ్మి భారత్ నుంచి సౌదీ అరేబియా వెళ్లి ఎడారిలో ఒంటెల కాపరిగా పని చేసే ఓ వ్యక్తి దుర్భర జీవితం ఇతివృత్తంగా ఇటీవల ఆడు జీవితం అనే సినిమా వచ్చింది.
బంగ్లాదేశీయులు లక్షల సంఖ్యలో గల్ఫ్ దేశాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. స్వదేశంలో పరిణామాలను సోమవారం వీరంతా అత్యంత ఆసక్తిగా పరిశీలించారు.
కొలువు కోసం సౌదీకొచ్చిన తెలంగాణ వాసి మూడు రోజులకే మృత్యువాతపడ్డాడు. ఇది తెలియని యజమాని, విధులకు రాకుండా అతడు పారిపోయాడంటూ కేసు పెట్టాడు. అయితే నెల రోజుల తర్వాత అతడు చనిపోయిన విషయం స్వదేశంలోని అతడి కుటుంబసభ్యులకు తెలిసింది.
గల్ఫ్, తదితర దేశాల్లోని వలస కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలని, రూ.500 కోట్ల బడ్జెట్ను కేటాయించాలని గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులు సీఎం రేవంత్రెడ్డిని కోరారు.
‘ఇంట్లో పరిస్థితులు బాగాలేక, కుమారుడికి మంచి చదువులు చదివిద్దామని ఆశపడి తణుకుకు చెందిన ఏజెంట్ సంజయ్ అనే వ్యక్తి ద్వారా రెండేళ్ల క్రితం ఒమాన్ రాజధాని మస్కట్కు వెళ్లాను. అక్కడ ఇంటి పని, పిల్లలను చూసుకునే పనికి కుదిరాను.