Home » Guntakandla Jagadish Reddy
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచి కాంగ్రెస్ లో చేరారని చెప్పారు.
విద్యుత్ కమిషన్ నుంచి తనకు లెటర్ వచ్చిందని.. కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారిపై తన అభిప్రాయం చెప్పాలని లెటర్ పంపించారని మాజీమంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు
గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి , ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. ఈరోజు(మంగళవారం) తెలంగాణ భవన్‌లో జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం నీటి వనరుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. నల్గొండ దాహార్తిని , ఆపద కాలంలో విద్యుత్ అవసరాన్ని తీర్చే టెయిల్ పాండ్ ఆధారాన్ని దొంగతనంగా ఖాళీ చేస్తే జిల్లా మంత్రులకు సోయిలేదని మండిపడ్డారు.
జిల్లాలో భూకబ్జాలకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ( Jagadish Reddy) పాల్పడ్డారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham) అన్నారు. సోమవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగదీష్ రెడ్డి జిల్లాలో భూకబ్జాలకు పాల్పడ్డారని.. పేదలను ఇబ్బందులకు గురించేశారని మండిపడ్డారు.
ఈడీ కేసుల పేరుతో ఎన్నికల ముందు ప్రతిపక్షాల నోరు నొక్కాలని కేంద్ర బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వల్ల బీజేపీ రాబోయే ఎన్నికల్లో ఓడిపోతుందని మోదీ అండ్ కో భయపడ్డారని విమర్శించారు.
కాంగ్రెస్ మంత్రులకు రైతుల గోడు వినే సమయం లేదని.. అక్రమంగా మామూళ్లు వసులు చేయడంలో వారు అరితేరారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) అన్నారు. శుక్రవారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో కరువు ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. నల్గొండ జిల్లాలోనే పెద్ద సంఖ్యలో వ్యవసాయ భూములు సాగు నీరు అందక ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లో ఓల్టేజ్ కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోయి రైతులకు వేల రూపాయల నష్టం కలగచేస్తున్నాయని చెప్పారు.
మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడంలో ఫెయిల్ అయిందని మాజీమంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) అన్నారు. గురువారం నాడు రేఖ్యా తండా, దుబ్బ తండాలలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (MLC Kavitha) ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. అయితే ఈ విషయంపై మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి(Jagadishwar Reddy) కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత అరెస్ట్‌ను రాజకీయ కుట్ర కోణంలోనే చూస్తున్నామని అన్నారు.
అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagdish Reddy) అన్నారు. కాంగ్రెస్ (Congress) పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని చెప్పారు.