Jagadish Reddy: రాజకీయ కుట్రతోనే కవిత అరెస్ట్
ABN , Publish Date - Mar 15 , 2024 | 09:58 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (MLC Kavitha) ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. అయితే ఈ విషయంపై మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి(Jagadishwar Reddy) కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత అరెస్ట్‌ను రాజకీయ కుట్ర కోణంలోనే చూస్తున్నామని అన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (MLC Kavitha) ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. అయితే ఈ విషయంపై మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి (Jagadish Reddy) కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత అరెస్ట్‌ను రాజకీయ కుట్ర కోణంలోనే చూస్తున్నామని అన్నారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏడాదిన్నర తర్వాత మోదీ అండో కో కుట్రతో కవితను అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
బీజేపీ రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా పని చేయించుకుంటుందని చెప్పారు. కవితను అరెస్ట్ చేయమని ఈడీ, ఐటీ అధికారులు కోర్టు ముందు చెప్పారని.. కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ప్రత్యర్థులను దెబ్బ తీయడానికి బీజేపీ ఇలాంటివి చేస్తోందన్నారు. కవిత నిర్ధోషిగా బయటకు వస్తారని చెప్పారు. రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి దుర్మార్గపు చర్యలకు బీజేపీ పాల్పడుతోందని జగదీశ్వర్ రెడ్డి అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి