Jagadish Reddy: మంత్రులు అందులో అరితేరారు
ABN , Publish Date - Mar 22 , 2024 | 03:37 PM
కాంగ్రెస్ మంత్రులకు రైతుల గోడు వినే సమయం లేదని.. అక్రమంగా మామూళ్లు వసులు చేయడంలో వారు అరితేరారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) అన్నారు. శుక్రవారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో కరువు ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. నల్గొండ జిల్లాలోనే పెద్ద సంఖ్యలో వ్యవసాయ భూములు సాగు నీరు అందక ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లో ఓల్టేజ్ కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోయి రైతులకు వేల రూపాయల నష్టం కలగచేస్తున్నాయని చెప్పారు.
యాదాద్రి: కాంగ్రెస్ మంత్రులకు రైతుల గోడు వినే సమయం లేదని.. అక్రమంగా మామూళ్లు వసులు చేయడంలో వారు అరితేరారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) అన్నారు. శుక్రవారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో కరువు ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. నల్గొండ జిల్లాలోనే పెద్ద సంఖ్యలో వ్యవసాయ భూములు సాగు నీరు అందక ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లో ఓల్టేజ్ కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోయి రైతులకు వేల రూపాయల నష్టం కలగచేస్తున్నాయని చెప్పారు.
TS Highcourt: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు
ఒక్కో మోటార్ రిపేర్‌కు సుమారు వారం రోజులు పట్టడంతో మోటార్ బిగించే లోపే పూర్తి పంట ఎండిపోతుందని అన్నారు. నల్గొండ జిల్లా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి రైతుల దుస్థితి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతుల దగ్గరికి మంత్రి రావాలంటేనే భయపడుతున్నారన్నారు. ఎక్కడ రైతు బంధు గురించి రైతులు నిలాదిస్తారోనని ఆయన రావడం లేదని చెప్పారు. ప్రభుత్వం రైతులకు ఎకరానికి కనీసం 10 వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Barrelakka: మరో అనౌన్స్‌మెంట్ చేసిన ‘బర్రెలక్క’.. త్వరలోనే శుభకార్యం అంటూ..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి