Share News

Jagadish Reddy: రైతు సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్

ABN , Publish Date - Mar 21 , 2024 | 10:01 PM

మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడంలో ఫెయిల్ అయిందని మాజీమంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) అన్నారు. గురువారం నాడు రేఖ్యా తండా, దుబ్బ తండాలలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు.

Jagadish Reddy:  రైతు సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్

సూర్యాపేట: మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడంలో ఫెయిల్ అయిందని మాజీమంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) అన్నారు. గురువారం నాడు రేఖ్యా తండా, దుబ్బ తండాలలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం రైతులకు ఎస్సారెస్పీ ఫేస్ 2 ద్వారా నీళ్లు ఇస్తామంటేనే పంట పొలాలు వేశారని చెప్పారు. రైతులకు స్పష్టమైన హామీ లభించిన తర్వాతే పంటలు వేశారని.. ఇప్పుడు నీళ్లను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

వేసిన పంటలకు నీరు ఇవ్వకుండా రైతాంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కో రైతు రూ. 25 నుంచి రూ.30 వేల పెట్టుబడి పెట్టి ఆగమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అవగాహన రాహిత్యం వల్ల రైతులు రోడ్డు మీద పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణవ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోతున్నప్పటికీ మంత్రులు ఎందుకు సమీక్ష చేయడం లేదని జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Mar 21 , 2024 | 10:02 PM