Home » Guntur
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ(బుధవారం) నిర్వహించే ఏపీ క్యాబినెట్ సమావేశంలో మద్యం విధానంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఉదయం 11గంటలకు జరిగే సమావేశంలో మంత్రులు పాల్గొని కీలక అంశాలపై చర్చించనున్నారు.
తెలుగునాట ప్రసిద్ధి చెందిన హరికథకుడు కోట సచ్చిదానంద శాస్త్రి(90) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గుంటూరు అమరావతి రోడ్డులోని నివాసంలో సోమవారం అర్ధరాత్రి మృతి చెందారు.
Andhrapradesh: ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. స్వచ్చంధంగా ఐపీఎస్‌లు రాజీనామా చేసి వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. సజ్జల వలనే తాము ఈ విధంగా చేశామని చెబితే వారి గౌరవం పెరుగుతోందన్నారు.
సమాజం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కష్టపడే తత్వం, మంచి బుద్ది, జ్ఞానం, సరిపడినంత ధనం, ధైర్యం కలిగిన తనలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి అవసరమైన సాయం చేయకుంటే సమాజం బాగుపడదనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన వివరించారు.
గుంటూరు జిల్లా: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను న్యాయస్థానం పోలీసు కస్టడికి అనుమతి ఇచ్చింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి 17వ తేదీ (మంగళవారం) మధ్యాహ్నం మంగళగిరి పోలీసులు రూరల్ స్టేషన్లో విచారించనున్నారు. తెలుగుదేశం ప్రధానకార్యాలయంపై దాడి కేసులో పోలీసులు విచారించనున్నారు.
విజయవాడ వరద ప్రాంతాల్లో జీఎంసీ సిబ్బంది 12 రోజులు సేవలు అందించారని గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాస్ కొనియాడారు. రోజు లక్ష మందికి ఆహారం, తాగునీరు, పాలు అందజేశారని వివరించారు.
విశాఖ జిల్లా భీమిలి బీచ్ సమీపంలో సీఆర్‌జడ్ నిబంధనలు ఉల్లంఘించి వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డి నిర్మించిన ప్రహరీ గోడ కూల్చివేతపై హైకోర్టులో విచారణ జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సొంత ఆదాయం పెంచుకునేలా మద్యం పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు చూసి ప్రజలు బాధపడుతున్నారని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 11సీట్లు కూడా ఎందుకు ఇచ్చామా అని ప్రజలు బాధపడే పరిస్థితిని ఆయన కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు.
సైనేడ్‌తో గుట్టుచప్పుడు కాకుండా దారుణ హత్యలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. వీరు ఇప్పటికే నలుగురిని ఈ విధంగా హత్య చేయగా మృతుల బంధువులు వాటిని సహజ మరణాలుగా భావించి అంత్యక్రియలు చేసేశారు.