Dokka Manikyavaraprasad: ఆ ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నా
ABN , Publish Date - Sep 16 , 2024 | 11:48 AM
Andhrapradesh: ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. స్వచ్చంధంగా ఐపీఎస్‌లు రాజీనామా చేసి వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. సజ్జల వలనే తాము ఈ విధంగా చేశామని చెబితే వారి గౌరవం పెరుగుతోందన్నారు.
గుంటూరు, సెప్టెంబర్ 16: చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దుర్మార్గంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నానని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముగ్గురిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని.. వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. స్వచ్చంధంగా ఐపీఎస్‌లు రాజీనామా చేసి వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. సజ్జల వలనే తాము ఈ విధంగా చేశామని చెబితే వారి గౌరవం పెరుగుతోందన్నారు.
Khairatabad Ganesh: నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేశుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీకే చెందిన ఎమ్మెల్యేను సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. అధికారుల చేత నటి జెత్వానీని అరెస్టు చేయించిన సజ్జలను అరెస్ట్ చేయాలన్నారు. ట్రిబ్యునల్‌కు వెళ్తామనటం సమర్థనీయం కాదన్నారు. ముగ్గురిని వైసీపీలో చేర్చుకొని జిల్లా అధ్యక్షులుగా చేయాలని.. లేదంటే జగన్ సెక్యూరిటీ అధికారులుగా నియమించుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి లేఖ రాసి ముగ్గురుని ఐపీఎస్ నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు.
అసలు విషయం ఏంటంటే...
కాగా.. ముంబై నటి కాదంబరి జెత్వానీ వ్యవహారంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎ్‌సఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతా, విజయవాడ మాజీ డీసీపీ విశాల్ గున్నీని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జెత్వానీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విజయవాడ పోలీసులు ఇచ్చిన నివేదికను డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రభుత్వానికి నివేదించారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ జీవో 1590, 1591, 1592 విడుదల చేసింది. మాజీ సీఎం జగన్ స్నేహితుడు సజ్జన్ జిందాల్‌ను కాదంబరి పెట్టిన కేసు నుంచి కాపాడేందుకు ఆమెను అక్రమ కేసులో ఇరికించి నరకం చూపించారు. వైసీపీ పెద్దల ఆదేశాల మేరకు ఐపీఎ్‌సలు పీఎ్‌సఆర్, కాంతిరాణా, విశాల్ గున్నీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు.
YS Viveka Murder Case:వివేకా కేసులో అవినాష్‌ను కాపాడుతున్న జగన్.. అసలు కారణం అదేనా..
ఆమెను, కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి టార్చర్ పెట్టారు. ఈ ముగ్గురు ఐపీఎ్‌సలపై గతంలో కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రానికి డీజీపీ కావాలనే ధ్యేయంతో ప్రతిపక్ష పార్టీల నేతల్ని హింసించడం, ప్రశ్నించే గొంతుకల్ని నొక్కేయడం, తప్పుడు కేసులతో వేధించడం లాంటి అడ్డగోలు పనులు చేసినట్టు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎ్‌సఆర్ ఆంజనేయులుపై విమర్శలు ఉన్నాయి. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి దొంగ ఓట్లు వేయించడం నుంచి బెజవాడలో అడ్డమైన పనులు చేయడం వరకు కాంతిరాణాపై ఆరోపణలు ఉన్నాయి. పోస్టింగ్ కోసం రాజధాని రైతుల్ని హింసించడం మొదలు దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత నాడు గుంటూరు ఎస్పీగా విశాల్ గున్నీ సొంతం.
ఇవి కూడా చదవండి...
AP Politics: స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి వైసీపీ తప్పుకుంటుందా..
Pawan Kalyan: నరసాపురం డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారంపై పవన్ కల్యాణ్ హర్షం..
Read Latest AP News AND Telugu News