Share News

Minister Ravindra: వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసింది

ABN , Publish Date - Sep 11 , 2024 | 06:15 PM

ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సొంత ఆదాయం పెంచుకునేలా మద్యం పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister Ravindra: వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసింది

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సొంత ఆదాయం పెంచుకునేలా మద్యం పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం మద్యం తెచ్చిన వైసీపీ నేతలు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడారని మండిపడ్డారు. నూతన మద్యం పాలసీ రూపకల్పనపై క్యాబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ పాల్గొన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు పర్యటించి ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాలపై అధికారులు ఇచ్చిన నివేదికపై మంత్రులు చర్చించారు.


ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.."ఏపీలో మంచి మద్యం పాలసీని త్వరలోనే తీసుకొస్తాం. అక్టోబర్-1నుంచి కొత్త విధానాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆరు రాష్ట్రాల మద్యం పాలసీలను అధ్యయనం చేస్తున్నాం. తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా పాలసీ రూపొందిస్తాం. గత వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ఏపీలో గంజాయి వినియోగం బాగా పెరిగింది. జగన్ చేసిన తప్పులపై ప్రజలే మాకు రెడ్ బుక్ ఇచ్చారు. సామాన్యుల నుంచి మొదలుకుని.. చంద్రబాబు వరకూ అందర్నీ జైల్లో పెట్టించి జగన్ వేధించారు. చేసిన తప్పుల నుంచి ఆయన తప్పించుకోలేరు. కచ్చితంగా శిక్ష పడుతుంది.


వైఎస్ జగన్ చేసిన అరాచకాలను ఎవ్వరూ మరచిపోలేరు. సీఎం చంద్రబాబు 10రోజులపాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ఉంటూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇప్పుడు మళ్లీ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లారు. విపత్కర పరిస్థితుల్లో ఇంతలా కష్టపడుతున్న మాపై జగన్ అసత్యపు ప్రచారం చేస్తున్నారు. జైల్లో ఉన్న ఖైదీని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ వెళ్లారు తప్ప వరద బాధితుల గురించి ఆయనకు అక్కర్లేదు" అని అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Minister Anagani: ఆ 11సీట్లు కూడా ఎందుకు ఇచ్చామని ప్రజలు బాధపడుతున్నారు..

జైలు బయట మాజీ సీఎం జగన్ సెల్ఫీలు..

వాటర్ ట్యాంక్‌పై వినాయకుడు.. ఐడియా అదిరింది..

Updated Date - Sep 11 , 2024 | 06:48 PM