Home » Hamas
ఉత్తర గాజాలో పరిస్థితులు రోజురోజుకు దయనీయంగా మారుతున్నాయి. దాడుల కన్నా ఆకలి బాధతోనే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. పే
ఇజ్రాయెల్పై అక్టోబర్ 7న జరిగిన ఘోరమైన దాడిలో ప్రాణాలతో బయటపడిన కోహెన్.. పాలస్తీనా టెర్రరిస్ట్ సంస్థ హమాస్ క్రూరత్వాన్ని కళ్లకుకట్టినట్లు వివరించాడు. ఇజ్రాయెల్ మహిళపై దారుణాతి దారుణంగా అత్యాచారం చేశారని చెప్పారు.
ఇజ్రాయెల్-హమాస్మధ్య కుదిరిన నాలుగు రోజుల తాత్కాలిక సంధి గడువు మరో రెండు రోజులు పొడిగించారు. ఒప్పందంలో భాంగా 50 మంది మహిళా ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఇందుకు ప్రతిగా హమాన్ చెరలో ఉన్న మరో 20 మంది ఖైదీలు విడుదల అవుతారని ఇజ్రాయెల్ భావిస్తోంది.
ఇజ్రాయెల్(Israeil)కు చెందిన ఇద్దరు ఇన్ఫార్మర్లను శనివారం తెల్లవారుజామున వెస్ట్ బ్యాంక్(West Bank)లోని తుల్కరేమ్ శరణార్థి శిబిరంలో పాలస్తీనా ఉగ్రవాదులు హతమార్చారు. ఒక గుంపు వారి మృతదేహాలను వీధుల్లోకి లాగి, తన్నుతూ విద్యుత్ స్తంభానికి వేలాడదీసింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన సంధి ఆచరణలోకి వచ్చింది. 12 మంది థాయ్లాండ్ బందీలను హమాస్ విడుదల చేసింది. ఈ విషయాన్ని థాయ్లాండ్ ప్రధాని థావిసిన్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
హమాస్ చెరలో ఉన్న డజన్ల సంఖ్యలో బంధీలకు త్వరలోనే విముక్తి కలగనుంది. ఈ మేరకు పాలస్తీనా మిలిటెండ్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బుధవారం కీలక ప్రకటన వెలువడింది.
ఆరు వారాలకుపైగా భీకరంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ యుద్ధం రెండు దేశాల మధ్య మొటిసారిగా సంధి కుదిరించింది. ఈ సంధిలో భాగంగా కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది.
గాజా(Gaza)లో ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమంలో భయంకర విషయాలు బయటకివస్తున్నాయి. ఉత్తర గాజా స్ట్రిప్(Gaza Strip)లో ఆసుపత్రులేవీ పని చేయడం లేదని హమాస్(Hamas) ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ తెలిపింది.
ఒక వైపు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న జనం.. మరో వైపు విదేశాలను ఆశ్రయిస్తున్న క్షతగాత్రులు.. ఇదీ గాజాలో పరిస్థితి. ఇలాంటి టైంలో యుద్ధం ముగించాలని ప్రపంచ దేశాల నుంచి ఇజ్రాయెల్- హమాస్(Israeil-Hamas)పై ఒత్తిడి చేస్తున్నా.. యుద్ధ విరమణపై ఎవరూ తగ్గేలా కనిపించడం లేదు. తమ వద్ద ఇంకా చాలా ఆయుధాలు ఉన్నాయని.. ఎన్ని నెలలైనా ఇజ్రాయెల్ తో పోరాటడానికి సిద్ధమని హమాస్ ప్రకటించడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఇజ్రాయెల్ - గాజాల(Israeil - Gaza) మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. తాజాగా గాజాను చుట్టు ముట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించడం ఆందోళనలు కలిగిస్తోంది. దీనికి ప్రతిగా హమాస్(Hamas) టెర్రరిస్టులు ఇజ్రాయెల్ సైన్యం మృతదేహాల్ని సంచుల్లో పెట్టి జెరూసలెంకి పంపుతామని హెచ్చరించడం యుద్ధ తీవ్రతను తెలియజేస్తోంది. పరస్పర హెచ్చరికలతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.