Share News

Israel: భూకంపం సృష్టించి.. భూస్థాపితం చేసి

ABN , Publish Date - Sep 30 , 2024 | 04:35 AM

హిజ్బుల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా బంకర్‌ అత్యంత దుర్బేధ్యమైనది. పైన ఆరు అంతస్తుల భవనం ఉండగా.. భూగర్భంలో రెండు సెల్లార్ల కింద ఈ బంకర్‌ ఉంది.

Israel: భూకంపం సృష్టించి.. భూస్థాపితం చేసి

  • అసాధారణ సాహసంతో హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లాను అంతం చేసిన ఇజ్రాయెల్‌

  • పాతాళంలో దాక్కున్నా.. ఇజ్రాయెల్‌ గురి తప్పలేదు

  1. హిజ్బుల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా బంకర్‌ అత్యంత దుర్బేధ్యమైనది. పైన ఆరు అంతస్తుల భవనం ఉండగా.. భూగర్భంలో రెండు సెల్లార్ల కింద ఈ బంకర్‌ ఉంది.

    Untitled-4 copy.jpg

  2. క్షిపణి/బాంబు దాడుల్ని తట్టుకునేందుకు ఉండాల్సిన మందం కంటే ఒకటిన్నర రెట్ల మందంతో బంకర్‌పై 3 లేయర్లను నిర్మించారు. వీటన్నింటినీ ఛేదిస్తూ నస్రల్లాను చంపడం చాలా కష్టమైన పని.

  3. ఒకవేళ దాడి జరిగితే తప్పించుకునేందుకు బంకర్‌ కింది నుంచి రహస్య మార్గం కూడా ఉంది.

Untitled-2 copy.jpg


2.నస్రల్లా ఈ బంకర్‌లో ఉన్నప్పుడు బంకర్‌ను ఎలా ఛేదించాలనే దానిపై ఇజ్రాయెల్‌ పైలట్లు ఎన్నో ప్రయోగాలు చేశారు. కొన్ని నెలల పాటు శిక్షణ పొందారు. నస్రల్లా ఈ బంకర్‌లోకి ప్రవేశించాడని ఒక ఇరానీ గూఢచారి ద్వారా ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌కు సమాచారం అందింది.

Untitled-3 copy.jpg

3.ఇజ్రాయెల్‌ వద్ద ఎఫ్‌-15ఐ, ఎఫ్‌-16ఐ, ఎఫ్‌-35 యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిల్లో ఎఫ్‌-16, ఎఫ్‌-35 కాస్త చిన్న సైజువి. ఎఫ్‌-15ఐ భారీ ఎత్తున ఆయుధాలు మోసుకెళ్లగలిగే పెద్ద విమానం కావడంతో ఇజ్రాయెల్‌ దానిని ఎంచుకుంది. ఇంతవరకు వైమానిక యుద్ధంలో ఎఫ్‌-15ను ఏ ఇతర విమానం కూల్చలేకపోయింది. ఒకవేళ బీరుట్‌లో లెబనాన్‌ విమానాలు ప్రతిఘటించినా వాటిని ఎదుర్కొనేందుకు కూడా ఎఫ్‌-15 బాగుంటుందని ఇజ్రాయెల్‌ భావించింది.

Untitled-3 copy.jpg


4.అమెరికా తయారీ జీబీయూ-28 బాంబులు బంకర్లను ఛేదించేందుకు అనువైనవి. వీటిని బంకర్‌ బస్టర్‌ బాంబులు అని పిలుస్తారు. ఇవి మొదట జరిగే ఒక పేలుడుతో కాంక్రీట్‌ స్లాబుల్లోకి కొంత మేర చొచ్చుకువెళతాయి. ఆ తరువాత మరోసారి పేలుతాయి. తద్వారా స్లాబ్‌ను పూర్తిగా ఛేదించగలుగుతాయి. కానీ ఆరంతస్తుల భవనం, దాని కింద మూడు లేయర్లు కలిగిన బంకర్‌ను ఛేదించాలంటే చాలా బాంబులు కావాలి.

Untitled-3 copy.jpg

5.నస్రల్లా సమాచారం అందగానే.. హట్జెరిమ్‌ ఎయిర్‌ బేస్‌ నుంచి ఏడు ఎఫ్‌-15ఐ యుద్ధ విమానాలు బయలుదేరాయి. దాడికి పెద్ద ఎత్తున బాంబులు అవసరం కావడంతో మూడు విమానాలకు పూర్తిగా బాంబులే అమర్చారు. మరి లెబనాన్‌ యుద్ధ విమానాలు వీటిపై దాడిచేస్తే? వాటిపై ప్రయోగించగలిగే ఎయిర్‌ టు ఎయిర్‌ క్షిపణులు అమర్చేందుకు వీటిలో ఇక చోటు లేదు. అందువల్ల మరో నాలుగు ఎఫ్‌-15లు పూర్తిగా క్షిపణులతో వీటికి రక్షణగా బయలుదేరాయి.

Untitled-3 copy.jpg


6.ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్‌ టు ఎయిర్‌ క్షిపణుల్లో ఆమ్రామ్‌ 120డి ప్రథమ శ్రేణిలో ఉంటుంది. మిగ్‌-25, మిగ్‌-29, ఎస్‌యూ-24 వంటి అనేక విమానాల్ని కూల్చిన చరిత్ర వీటికి ఉంది. ఇజ్రాయెల్‌ ఎఫ్‌-15లలోవీటిని అమర్చారు.

Untitled-3 copy.jpg

7.నస్రల్లా భవనంపైకి ఎఫ్‌-15లు చేరుకోగానే.. దాడి చేయాలంటూ హాట్జెరిమ్‌ ఎయిర్‌బేస్‌ నుంచి వాటికి ఆదేశాలు అందాయి. ఆ వెంటనే ఫైటర్‌ పైలట్‌ ‘కెప్టెన్‌-ఎం’ జీబీయూ-28 బాంబులను ఆ భవనంపై జారవిడిచారు. సెకన్లలోనే పదుల సంఖ్యలో బాంబులు పడడంతో.. ఆరంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. జీబీయూ-28 బాంబులు నస్రల్లా ఉన్న బంకర్‌ లేయర్లను చీల్చుకుంటూ వెళ్లాయి. ఒకటిన్నర నిమిషాల్లోనే భవనం కుప్పకూలింది. ఒక బాంబు వల్ల ఏర్పడిన రంధ్రం ద్వారా మరో బాంబు.. తద్వారా ఇంకో బాంబు.. ఇలా పాతాళం దాకా బాంబులు చేరుకున్నాయి. మొదటి ఒకటిన్నర నిమిషంలోపే నస్రల్లా చనిపోయినట్లు అనిపించినా.. ఎంత మాత్రం తప్పించుకోకూడదు అనే ఉద్దేశంతో 7 నిమిషాలపాటు 80 బాంబులు వేశారు. బాంబుల దాడి ఏ స్థాయిలో జరిగిందంటే.. అక్కడ రిక్టర్‌ స్కేల్‌పై సుమారు 3.2 తీవ్రతతో భూకంపం రికార్డు అయింది. లెబనాన్‌ యుద్ధ విమానాల నుంచి ఎఫ్‌-15లకు ఎలాంటి ప్రతిఘటన ఎదురుకానేలేదు.

Untitled-3 copy.jpg

Updated Date - Sep 30 , 2024 | 10:53 AM