Home » Hardik Pandya
ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. బౌలర్లు నామమాత్రంగా మారిన ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.
ఐపీఎల్ 2024 సీజన్లో ఫస్ట్ మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ జట్టుపై చేధించలేకపోయింది. ముంబై జట్టు కొత్త కెప్టెన్ హర్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ఆట మీద దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అభిమానులు అయితే ఏకీపారేస్తున్నారు.
ఐపీఎల్ 2024లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వివాదం ఇప్పట్లో సద్దు మణిగేలా లేదు. కెప్టెన్సీ మార్పు జరిగి 3 నెలలు గడిచినా అభిమానుల ఆగ్రహావేశాలు మాత్రం ఇంకా చల్లారడం లేదు.
ఐపీఎల్ 2024 ఫస్ట్ మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ ఓటమితో ప్రారంభించింది. కొత్త కెప్టెన్ హర్ధిక్ పాండ్యా జట్టు సభ్యులను కమాండ్ చేశాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఆదేశాలు జారీ చేశాడు. రోహిత్ శర్మను వెనక్కి వెళ్లు అని ఆదేశించాడు. హర్ధిక్ అలా చెప్పడంతో రోహిత్ శర్మ కాస్త ఆశ్చర్య పోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో అతిథ్య జట్టు గుజరాత్ టైటాన్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరో 3 రోజులు మాత్రమే ఉంది. దీంతో ఆటగాళ్లంతా ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని జట్లన్నీ భావిస్తున్నాయి. అయితే ఆటగాళ్ల గాయాలు ఫ్రాంచైజీలకు ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదంపై హార్దిక్ పాండ్యా స్పందించాడు. తన కెరీర్లో దాదాపుగా అన్ని మ్యాచ్‌లు రోహిత్ శర్మ సారథ్యంలోనే ఆడానని అన్నాడు. రోహిత్ కెప్టెన్సీలో ఎన్నో విజయాలు సాధించామని గుర్తు చేసుకున్నాడు. తన కెప్టెన్సీలో ఆడేందుకు రోహిత్ శర్మ ఎలాంటి ఇబ్బంది పడకపోవచ్చని, హిట్ మ్యాన్‌తో కలిసి ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. రానున్న ఐపీఎల్ సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను తప్పించడంపై పెద్ద దుమారమే రేగుతోంది.
ఐపీఎల్ 2024(ipl 2024) కోసం అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లు తమ తమ జట్లలో చేరడం ప్రారంభించారు. ఇదే సమయంలో హార్దిక్ పాండ్యా(hardik pandya) ఈసారి ముంబై ఇండియన్స్‌కు బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో పాండ్యాకు సంబంధించిన ఓ డ్రెస్సింగ్ రూం పూజ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
చీలమండ గాయం కారణంగా చాన్నాళ్లపాటు క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తిరిగి బ్యాట్ చేతపట్టాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా పేరు ప్రకటించిన తర్వాత తొలిసారి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ 2024 ఎడిషన్ మార్చి 22 నుంచి ఆరంభం కానున్న నేపథ్యంలో ముంబై ప్రాక్టీస్ సెషన్లో ముమ్మర కసరత్తులు ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ యాజమాన్యం ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసింది.