Share News

IPL2024: జోరుగా ప్రాక్టీస్ చేస్తున్న హార్ధిక్ పాండ్యా.. వీడియో షేర్ చేసిన ముంబై ఇండియన్స్

ABN , Publish Date - Mar 12 , 2024 | 10:36 AM

చీలమండ గాయం కారణంగా చాన్నాళ్లపాటు క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తిరిగి బ్యాట్ చేతపట్టాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా పేరు ప్రకటించిన తర్వాత తొలిసారి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ 2024 ఎడిషన్ మార్చి 22 నుంచి ఆరంభం కానున్న నేపథ్యంలో ముంబై ప్రాక్టీస్ సెషన్‌లో ముమ్మర కసరత్తులు ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ యాజమాన్యం ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసింది.

IPL2024: జోరుగా ప్రాక్టీస్ చేస్తున్న హార్ధిక్ పాండ్యా.. వీడియో షేర్ చేసిన ముంబై ఇండియన్స్

ముంబై: చీలమండ గాయం కారణంగా చాన్నాళ్లపాటు క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా (Hardik Pandya) తిరిగి బ్యాట్ చేతపట్టాడు. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్‌గా పేరు ప్రకటించిన తర్వాత తొలిసారి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ 2024 (IPL 2024) ఎడిషన్ మార్చి 22 నుంచి ఆరంభం కానున్న నేపథ్యంలో ముంబై ప్రాక్టీస్ సెషన్‌లో ముమ్మర కసరత్తులు ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ యాజమాన్యం ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసింది.

కాగా ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్‌ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. మార్చి 24న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించిన జట్టుపైనే ముంబై తొలి మ్యాచ్ ఆడనుండడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

T20 World Cup: టీ20 వరల్డ్‌ కప్‌నకు షమి దూరం.. భారత్‌కు బిగ్ షాక్

రోహిత్‌.. చెన్నైకు ఆడాలి!

మరిన్ని స్పోర్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Mar 12 , 2024 | 11:02 AM