MI vs GT: టాస్ గెలిచిన ముంబై.. తుది జట్లు ఇవే!
ABN , Publish Date - Mar 24 , 2024 | 07:11 PM
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో అతిథ్య జట్టు గుజరాత్ టైటాన్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
అహ్మదాబాద్: గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో అతిథ్య జట్టు గుజరాత్ టైటాన్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్‌లో రెండు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ వ్యవహరిస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత ఐపీఎల్ రోహిత్ శర్మ సాధారణంగా ఆటగాడిగా బరిలోకి దిగుతుండడం గమనార్హం. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో తలపడగా అత్యధికంగా గుజరాత్ 3, ముంబై ఒకటి గెలిచాయి.
తుది జట్లు
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, షామ్స్ ములానీ, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్