Home » Health and Beauaty Tips
పండగ సీజన్ వచ్చేస్తోంది. పండగ కన్నా ముందే కొన్ని పిండి వంటలు ట్రై చేస్తే బావుంటుంది కదా! అందుకే కొన్ని స్పెషల్ పిండి వంటలు ఇస్తున్నాం.. ఆస్వాదించండి..
Dry Grapes Benefits: ఎండుద్రాక్షను ఎప్పుడు తినాలి.. ఏ సమయంలో తింటే దాని ప్రయోజనాలు పూర్తిగా శరీరానికి అందుతాయి.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు.. ఇంట్రస్టింగ్ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మన శరీరంలో డయాఫ్రమ్ అనే కండరం ఉంటుంది. ఇది శ్వాస తీసుకునేందుకు, వదిలేందుకు ఉపయోగపడే కండరం. ఇది అస్వస్థతకు గురైనప్పుడు మనకు ఎక్కిళ్లు వస్తాయి. కండరం అకస్మాత్తుగా సంకోచించడం వల్ల ఎక్కిళ్లు వస్తుంటాయి.
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉండడం వల్ల మన శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తాయి. అయితే ఇలాంటి గొప్ప ఔషధ గుణాలు కలిగిన కరివేపాకుతో టీ చేసుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మన రోజువారీ కార్యక్రమాలు అన్ని దానిపైనే ఆధారపడి ఉంటాయి. అలాగే మంచి జీవనశైలితో ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. అందుకు తగిన విధంగానే వారు ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తూ తీవ్రంగా కృషి చేస్తుంటారు. అందులో భాగంగానే మద్యం వంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉంటారు. ఎందుకంటే ఇవి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి కాలేయం, కిడ్నీలు వంటి అవయవాలను దెబ్బతీస్తాయి. అటువంటి వారు సైతం తమకు తెలియకుండానే లివర్ డ్యామేజ్ చేసే ఆహార పదార్థాలు తరచుగా తింటుంటారు. అవి ఎంటో ఇప్పుడు చూద్దాం..
చర్మం బిగుతుగా, యవ్వనంగా ఉంటే నేచురల్ బ్యూటీ అని పిలుస్తుంటారు. అయితే ఈ కాలం జీవనశైలికి ఇది అంత సులువు కాదు. చాలా చిన్న వయసులోనే చర్మం ముడుతలు పడి ఉన్న వయసు కంటే పెద్దవాళ్లుగా కనిపిస్తుంటారు. కానీ రాత్రి సమయంలో..
Monsoon Health Tips: ప్రతి సీజన్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కానీ, వర్షాకాలంలో మాత్రం దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో దోమల వ్యాప్తి, పారిశుద్ధ్య సమస్యల కారణంగా.. త్వరగా వ్యాధులు ప్రభలుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే.. పోషకాలు అధికంగా ఉండే కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి.
ఋగ్వేదంలో దానా, కరంభ, అపూపాలనే వంటకాల గురించి ఉంది. యవధాన్యాన్ని (బార్లీ) నేతితో వేగించి, పలుచని జావ కాస్తే ‘యవాగూ’ అని, అన్నంలాగా వండితే దాన్ని ‘దానా’ అనీ, విసిరిన పిండి(సక్తు)ని వెన్నతో తడిపి రొట్టె కాలిస్తే ‘అపూప’ అనీ, ఆ పిండిని ఉడికించి పెరుగు కలిపితే దాన్ని ‘కరంభకం’ అనీ అన్నారు.
Monsoon Health Tips: ప్రతీ సీజన్లో ఏవో ఒక అనారోగ్య సమస్యలు ప్రజలను వేధిస్తూనే ఉంటాయి. అయితే, వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఈ సమస్య మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సీజన్లో అనేక రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వాతావరణంలో మార్పులు, వర్షాలు, వరదలు, బురద పేరుకుపోవడం, దోమలు వృద్ధి చెందడం వంటివి..
'రోజుకో యాపిల్ తింటే డాక్టర్లకు దూరంగా ఉండవచ్చు' అనే మాట అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఈ పండులో చాలా ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి. కానీ యాపిల్ జ్యూస్ చర్మానికి రాస్తే..