Home » Heavy Rains
తెలంగాణలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో కుండపోతగా వానలు కురుస్తుండటంతో మున్నేరు వారు పొంగి ఉధృతంగా ప్రవహించింది. దీంతో లోతట్టు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి బీజేపీ పార్టీ ముందుకు వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు.
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈనెల తొమ్మిదవ తేదీకి ఒడిస్సా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశముంది.
తెలంగాణలో బారీ వర్షాలు పడుతన్నాయి. హైదరాబాద్లో వర్షాలు దంచికొడుతుండటంతో జంట జలాశయాల గేట్లను జలమండలి అధికారులు. ఎత్తారు. వరద వస్తుండటంతో ఉస్మాన్ సాగర్ 2 గేట్లు, హిమాయత్ సాగర్ ఒక గేటు ఎత్తివేశారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను బల్దియా అప్రమత్తం చేసింది.
న్టీఆర్ జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదైందని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి ఆర్పీ సిసోడియా తెలిపారు. జిల్లాలో 21 సెంటిమీటర్ల పడాల్సి ఉండగా 34.5 సెం.మీ. వర్షం పడిందని చెప్పారు. ఏడు జిల్లాలో వర్షాలు బాగా కురిశాయని అన్నారు.
రాజధాని హైదరాబాద్లో శుక్రవారం సాయంత్రం.. ఉద్యోగులు ఆఫీసు పని ముగించుకుని ఇళ్లకు బయల్దేరే సమయంలో భారీ వర్షం కురిసింది.
కృష్ణా బేసిన్లో కురుస్తున్న వర్షాలకు మళ్లీ వరదలు ప్రారంభమయ్యాయి. దాంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.
వరదలకు విజయవాడ, కృష్ణా జిల్లాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర తెలిపారు. కూటమి నేతలు అందరూ నిరంతరం ప్రజల కష్టాలు తీర్చేందుకు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారని.. బాధితులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు(శుక్రవారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు.
ఏపీలో ఆరు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏరియల్ సర్వే నిర్వహించి కొల్లేరు వరకూ వెళ్లి తర్వాత బుడమేరును అధ్యయనం చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కృష్ణనదికి వస్తున్న వరదపై క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు వివరించారు. బుడమేరులో ఇంకా పని ముమ్మరంగా జరుగుతోందని అన్నారు.
వరద నష్టంపై సచివాలయంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అధికారులు సమావేశం అయ్యారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఏపీలో జరిగిన వరద ప్రభావిత ప్రాంతాల దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా సీఎం, అధికారులు వివరించారు.