TG News: వరద బాధితులకు అండగా బీజేపీ.. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 07 , 2024 | 07:03 PM
తెలంగాణలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో కుండపోతగా వానలు కురుస్తుండటంతో మున్నేరు వారు పొంగి ఉధృతంగా ప్రవహించింది. దీంతో లోతట్టు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి బీజేపీ పార్టీ ముందుకు వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు.
ఖమ్మం: తెలంగాణలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో కుండపోతగా వానలు కురుస్తుండటంతో మున్నేరు వారు పొంగి ఉధృతంగా ప్రవహించింది. దీంతో లోతట్టు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి బీజేపీ పార్టీ ముందుకు వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. వరద బాధితుల కోసం నిత్యావసర వస్తువుల పంపిణీని ఈరోజు (శనివారం) ప్రారంభించినట్లు వివరించారు.
రాష్ట్ర కార్యాలయం నుంచి మూడు ట్రక్కుల్లో నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం తమ పార్టీ నేతలు ముందుకు వచ్చారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రక్కులను ఖమ్మం జిల్లాకు పంపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కోసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి, బిజెపి నేత గూడూరు నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సంరద్భంగా బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ... ఖమ్మంలో ఏరియల్ సర్వే చేస్తుంటే చాలా బాధేసిందని అన్నారు. వరదల్లో అక్కడి ప్రజలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో ఉన్నారని చెప్పారు. తినడానికి కనీసం తినుబండారాలు కూడా వారికి లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారికి కనీస ఆహార పదార్థాలు అందించాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ తరుపున నిత్యవసరాలు పంపిస్తున్నట్లు వివరించారు. కేంద్ర బృందాల పర్యటన అనంతరం వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందుతుందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హామీ ఇచ్చారు.