Share News

Hanumantha Rao: ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుంది: హనుమంతరావు

ABN , Publish Date - Sep 06 , 2024 | 10:46 PM

ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు(శుక్రవారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు.

Hanumantha Rao: ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుంది: హనుమంతరావు

ఖమ్మం జిల్లా: ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు(శుక్రవారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ... తెలంగాణలో విపరీతంగా భారీ వర్షం పడుతూనే ఉండటంతో పలు ప్రాంతాలు మునిగిపోయాయని వి. హనుమంతరావు పేర్కొన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు ఈ ప్రాంతంలో వెంటనే పర్యటించి బాధితులను పరామర్శించి, ధైర్యం చెప్పారని గుర్తుచేశారు. ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని అన్నారు. తాము రావాలి అనుకున్నాం కానీ ప్రజలు కోపంగా ఉంటారని రాలేకపోయామని వి. హనుమంతరావు చెప్పారు.


బొక్కల గడ్డ, మోతీనగర్, వేంకటేశ్వరనగర్ ప్రజలకు కట్టుబట్టలు కూడా లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సహాయనిధికి చాలా మంది సహాయం చేస్తున్నారని అన్నారు, ఇంకా చాలా మందికి సాయం చేయాల్సి ఉందని హనుమంతరావు వెల్లడించారు.

Updated Date - Sep 06 , 2024 | 10:46 PM