Home » Himachal Pradesh
హిమాచల్ ప్రదేశ్‌లో వేగంగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు శుక్రవారంనాడు రాజీనామా చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి తమ రాజీనామాలను సమర్పించారు. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు వీరు సిద్ధమవుతున్నారు.
ఇటివల కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్ ఎక్కువైంది. పెళ్లి చేసుకోబోయే ప్రతి జంట దాదాపు అనేక ప్రాంతాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ల పేరుతో ఫోటోలు, వీడియోలు చిత్రీకరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టెలివిజన్ నటి ఆర్య వోరా(Aarya Voraa) ప్రీ వెడ్డింగ్ షూట్(pre wedding shoot) తన ప్రాణాలమీదకు వచ్చిందని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
హిమాచల్ ప్రదేశ్ రెబల్ ఆరుగురు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేసిన సంగతి తెలిసిందే. ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనర్హతపై స్టే విధించాలని కోరగా, సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది.
హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తీవ్రమవుతోంది. ఎన్నికల్లో నేరాలకు పాల్పడ్డారంటూ ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే తండ్రి, మరికొందరిపై పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు.
సుఖ్వీందర్ సింగ్ సుఖు సారథ్యంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి, పార్టీకి మధ్య తలెత్తిన విభేదాల పరిష్కారానికి కాంగ్రెస్ అధిష్ఠానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య మెరుగైన సమన్వయం కోసం ఆరుగురు సభ్యులతో సమన్వయ కమిటీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారంనాడు ప్రకటించారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం(Himachal pradesh crisis) మరింత ముదిరింది. కాంగ్రెస్ తిరుగుబాటుదారులతో సహా 11 మంది ఎమ్మెల్యేలు శనివారం బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌కు చేరుకున్నారు.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజు భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో చివరి మ్యాచ్ ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆటలో ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ పదవీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సుధీర్ శర్మను తొలగించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలతో శర్మను పదవీ నుంచి తొలగించామని జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటనలో తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో గల ధర్మశాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుధీర్ శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో మంత్రిగా కూడా విధులు నిర్వహించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో అనర్హతకు గురయిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమపై స్పీకర్ కుల్దీప్ సింగ్ అనర్హత వేటు వేయడం అక్రమం, రాజ్యాంగ విరుద్ధం అని ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేసిన సంగతి తెలిసిందే.
తూర్పు, ఈశాన్య భారతదేశంలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు మార్చి 5 నుంచి మార్చి 7 వరకు ఉంటాయని వెల్లడించింది. అయితే ఏ రాష్ట్రాల్లో వర్షాలు ఉంటాయనేది ఇక్కడ తెలుసుకుందాం.