Congress: హిమాచల్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం | Himachal Pradesh crisis: Congress' BIG move amid rebellion, forms 6-member committee vsl
Share News

Congress: హిమాచల్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం

ABN , Publish Date - Mar 11 , 2024 | 08:59 AM

హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తీవ్రమవుతోంది. ఎన్నికల్లో నేరాలకు పాల్పడ్డారంటూ ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యే తండ్రి, మరికొందరిపై పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు.

Congress: హిమాచల్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం

  • స్వతంత్ర ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యే తండ్రి, మరికొందరిపై పోలీసు కేసులు

సిమ్లా, మార్చి 10: హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తీవ్రమవుతోంది. ఎన్నికల్లో నేరాలకు పాల్పడ్డారంటూ ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యే తండ్రి, మరికొందరిపై పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు. గతనెల 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించారు. ఆ ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేయగా, వారం తా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సంజయ్‌ అవస్థీ, భువనేశ్వర్‌ గౌర్‌ల ఫిర్యాదు ఆధారంగా స్వతంత్ర ఎమ్మెల్యే ఆశిష్‌ శర్మ, ప్రస్తుతం అనర్హత వేటు పడిన కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యే చైతన్య శర్మ తండ్రి, మరికొందరిపై నేర కుట్ర, అవినీతి, ఎన్నికల్లో అనవసర జోక్యానికి పాల్పడ్డారంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. చైతన్య శర్మ తండ్రి ఏం నేరానికి పాల్పడ్డారనేది తెలియరాలేదు. కాగా, పోలీసు కేసులపై రెబెల్‌ ఎమ్మెల్యేలు స్పందించారు. భవిష్యత్తు పరిణామాలు ఎదుర్కొనేందుకు సీఎం సిద్ధంగా ఉండాలని కాం గ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యే రాజిందర్‌రాణాహెచ్చరించారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Mar 11 , 2024 | 09:00 AM