Rain Alert: ఈ ప్రాంతాల్లో మార్చి 7 వరకు భారీ వర్షాలు.. ప్రజలకు అలర్ట్
ABN , Publish Date - Mar 05 , 2024 | 08:05 AM
తూర్పు, ఈశాన్య భారతదేశంలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు మార్చి 5 నుంచి మార్చి 7 వరకు ఉంటాయని వెల్లడించింది. అయితే ఏ రాష్ట్రాల్లో వర్షాలు ఉంటాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో సోమవారం ఎండ, వెచ్చని వాతావరణం కొనసాగింది. కానీ మంగళవారం నాటికి మాత్రం పశ్చిమ హిమాలయాలు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వంటి కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు(heavy rains), మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) తెలిపింది.
ఇదే సమయంలో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో తూర్పు, ఈశాన్య భారతదేశంలో మార్చి 5 నుంచి 7 వరకు భారీ వర్షాలు హిమపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ కారణంగా మరోసారి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అంచనా వేసింది.
అంతకుముందు సోమవారం హిమాచల్ ప్రదేశ్(himachal pradesh)లో భారీ వర్షం(heavy rains), హిమపాతం కారణంగా ఐదు జాతీయ రహదారులతో సహా 600కుపైగా చోట్ల రోడ్లు మూసివేయబడ్డాయి. అంతేకాదు భారీగా కురుస్తున్న మంచు కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొండ ప్రాంతాల నుంచి వీస్తున్న చలి గాలుల కారణంగా ఢిల్లీ(delhi)లో స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ వారం దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని తెలుస్తోంది.
ఇక సౌత్ ఇండియా గురించి చెప్పాలంటే ఇక్కడ వేడి వాతావరణం కొనసాగుతుంది. కేరళ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక సహా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో కొడుకు టైటిల్ కైవసం.. నెట్టింట అభినందనలు