Himachal Crisis: సుప్రీంకోర్టును ఆశ్రయించిన అనర్హతకు ఆరుగురు ఎమ్మెల్యేలు
ABN , Publish Date - Mar 05 , 2024 | 04:48 PM
హిమాచల్ ప్రదేశ్‌లో అనర్హతకు గురయిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమపై స్పీకర్ కుల్దీప్ సింగ్ అనర్హత వేటు వేయడం అక్రమం, రాజ్యాంగ విరుద్ధం అని ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal Pradesh) అనర్హతకు గురయిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు. తమపై స్పీకర్ కుల్దీప్ సింగ్ (Kuldeep Singh) అనర్హత వేటు వేయడం అక్రమం, రాజ్యాంగ విరుద్ధం అని ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేశారు. బీజేపీ సభ్యుడు హర్ష్ మహాజన్‌కు ఓటు వేయడంతో ఆ అభ్యర్థి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి ఓడిపోయారు. ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కుల్దీప్ సింగ్‌ను కాంగ్రెస్ పార్టీ కోరింది. దాంతో ఆరుగురిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. తమ అనర్హతపై గత వారం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.