Home » Hyderabad
మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్ (Banjara Hills) పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ గోపి(ADE Gopi) తెలిపారు.
సుదీర్ఘకాలం తరువాత ఎట్టకేలకు సచివాలయ అధికారుల సంఘం ఎన్నికలు నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తరువాత కొత్త సంఘానికి సోమవారం ఎన్నికలు జరిగాయి.
‘‘తెలుగు రాష్ట్రాలను ఇంగ్లిష్ అనే వ్యామోహం కమ్మేసింది’’ అని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనూ మాతృభాషకు ప్రమాదం లేదని, ఈ విషయంలో ఒడిశా కూడా మనకన్నా మెరుగ్గానే ఉందని వ్యాఖ్యానించారు.
ట్రాఫిక్ చలానా తరహాలో.. రోడ్ల పక్కన చెత్త వేసేవారికి జరిమానా విధించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) రంగం సిద్ధం చేస్తోంది. వాహనాల నంబర్ల ఆధారంగా సంబంధిత వ్యక్తుల ఇంటికి జరిమానా వివరాలు పంపనున్నారు.
నగరంలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయాల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు సాగాయి.
చెరువులను పరిరక్షిస్తూ పర్యావరణ హితంగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా హైడ్రా ముందడుగు వేసింది. ఈ మేరకు సోమవారం రోజున పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో పీసీబీ సెక్రటరీ రవితో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశం అయ్యారు.
షాద్నగర్లో ఓ మల్టీ నేషనల్ కంపెనీ(MNC)కి రూ.300 కోట్ల విలువైన భూమిని స్వస్తిక్ రియల్టర్ కంపెనీ విక్రయించింది. అయితే దానికి సంబంధించిన వివరాలను కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఎక్కడా చూపలేదనే ఆరోపణలు గుప్పుమన్నాయి.
కాంగ్రెస్ నేత, చక్రధర్ గౌడ్ ఫిర్యాదుపై గతంలో రెండుసార్లు పోలీసులు విచారణ చేశారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం మరోసారి విచారణకు రావాలని పోలీసులు ఆదేశించడంతో జూబ్లీహిల్స్ ఏసిపి ముందు చక్రధర్ గౌడ్ విచారణకు హాజరయ్యారు.
భారతదేశపు తొలి దీర్ఘ శ్రేణి హైపర్సానిక్ (శబ్దం కన్నా ఐదు రెట్లు, అంతకు మించి వేగంతో వెళ్లే) క్షిపణిని రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి (డీఆర్డీవో) సంస్థ ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ దీవి నుంచి విజయవంతంగా పరీక్షించింది.
స్పోర్ట్స్ అథారిటీ ఆప్ తెలంగాణ ఆధ్వర్యంలో అక్టోబర్ 18న గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఇండియా, మలేషియా మధ్య జరగనున్న ఫిఫా ఫుట్ బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్ను నవంబర్ 14న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.