Share News

IT Raids: హైదరాబాద్‌, షాద్‌నగర్‌లో ఐటీ దాడులు

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:32 AM

నగరంలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కార్యాలయాల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు సాగాయి.

IT Raids: హైదరాబాద్‌, షాద్‌నగర్‌లో ఐటీ దాడులు

  • స్వస్తిక్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ, ఆగ్రో కంపెనీలో తనిఖీలు

  • రియల్టర్‌ ఆకుల రవి ఇంటితో పాటు మరో చిట్‌ఫండ్‌ కంపెనీలో సోదాలు

హైదరాబాద్‌, నవంబరు18(ఆంధ్రజ్యోతి): నగరంలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కార్యాలయాల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు సాగాయి. నగరంలోని బంజారాహిల్స్‌, బేగంబజార్‌, గచ్చిబౌలితో పాటు షాద్‌నగర్‌లోని స్వస్తిక్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కార్యాలయాల్లో ఈ సోదాలు నిర్వహించారు. ఫరూఖ్‌నగర్‌ మండలం ఎలికట్టలోని ఇండస్ర్టీయల్‌ ఏరియాలో ఉన్న స్వస్తిక్‌ గ్రూప్‌ అనుబంధ పరిశ్రమ ఫోర్‌ ఆగ్రో ఎల్‌ఎల్‌పీ పరిశ్రమలో సోదాలు జరిగాయి.


షాద్‌నగర్‌ పట్టణం పద్మావతి కాలనీలోని రియల్టర్‌ ఆకుల రవి నివాసంతో పాటు సమీపంలో ఉన్న చిట్‌ఫండ్‌ యజమాని బండారి రమేష్‌ నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. షాద్‌నగర్‌ సమీపంలో రూ. 300 కోట్ల విలువ చేసే భూమి అమ్మకానికి సంబంధించి లెక్కలు సరిగా చూపకపోవడంతో ఈ మూకుమ్మడి దాడులు నిర్వహించినట్లు తెలిసింది. మరోవైపు కొత్తూరు మండలానికి చెందిన రియల్టర్‌ జార్జిరెడ్డి నివాసం, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Updated Date - Nov 19 , 2024 | 01:32 AM