Hyderabad: గచ్చిబౌలి స్టేడియం వేదికగా.. రేపే ఫుట్ బాల్ మ్యాచ్
ABN , Publish Date - Nov 17 , 2024 | 08:34 PM
స్పోర్ట్స్ అథారిటీ ఆప్ తెలంగాణ ఆధ్వర్యంలో అక్టోబర్ 18న గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఇండియా, మలేషియా మధ్య జరగనున్న ఫిఫా ఫుట్ బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్‌ను నవంబర్ 14న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్, నవంబర్ 17: భాగ్యనగరానికి ఫుట్ బాల్ పీవర్ మొదలైంది. సోమవారం ఇండియా, మలేసియా మధ్య ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. సోమవారం రాత్రి 7.00 గంటలకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ ఫుట్ బాల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అందుకోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ భారీగా ఏర్పాట్లు చేస్తుంది.
Also Read:రైతులు.. ధాన్యం విక్రయించేందుకు వాట్సాప్ నెంబర్ ఇదిగో..
Also Read: ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
Also Read: చిన్న ఉసిరి వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
ఈ మ్యాచ్ ప్రారంభ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. మరోవైపు ఈ మ్యాచ్‌లో పాల్గొనే ఇరు జట్లు.. ఇండియా, మలేషియా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి. ఈ జట్లు ప్రాక్టీస్‌లో తలమునకలై.. ఉన్నాయి.
Also Read: UttarPradesh: పసి కందుల సజీవ దహనానికి కారణమిదే..
Also Read: వాహన కొనుగోలు దారులకు గుడ్ న్యూస్
Also Read: ఎన్నికల ప్రచారంలో నవనీత్ కౌర్‌పై దాడి
ఇక ఈ ఫుట్ బాల్ మ్యాచ్ కోసం సిటీ యువత ఆసక్తిగా ఎదురు చూస్తుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆప్ తెలంగాణ ఆధ్వర్యంలో అక్టోబర్ 18న గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఇండియా, మలేషియా మధ్య జరగనున్న ఫిఫా ఫుట్ బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్‌ను నవంబర్ 14న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
For Telangana News And Telugu News