Home » HYDRA
ఎల్కేజీ చదివే వేదశ్రీకి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు.. 50 ఏళ్ళ కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది.. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది.. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా .. పేక మేడల కూల్చివేయబడిందంటూ హైడ్రాపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.
దుర్గం చెరువు పూర్తి స్థాయి నీటి నిల్వ (ఎఫ్టీఎల్)కు సంబంధించి తుది నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
హిమాయత్‌సాగర్‌లో ఆక్రమణల గుర్తింపునకు సంబంధించిన నివేదికపై అస్పష్టత నెలకొంది.
నిబంధనలను తుంగలో తొక్కి జీహెచ్ఎంసీ అనుమతులు పొందిన నెట్ నెట్ వెంచర్స్ అక్రమంగా ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తోందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చినా
అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా.. పటాన్చెరు పరిధి కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడ గ్రామాలలో ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలుపెట్టిన కూల్చివేతలు ఏకధాటిగా 20 గంటలపాటు కొనసాగాయి!
చెరువులు, నాలాలపై ఆక్రమణలను కూల్చివేస్తూ దూసుకెళ్తున్న హైడ్రాకు తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్ట్ స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరవుతారని, వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుంచి ఆరు వారాలలోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశించింది.
Telangana: మాదాపూర్‌లో కూల్చివేతలు మొదలుపెట్టింది హైడ్రా. కావూరి హిల్స్ పార్కు స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. పార్కులో స్పోర్ట్స్ అకాడమిపై గత కొంతకాలంగా కావురి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదులు చేసింది.
Telangana: హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. కూల్చివేతలు చేశాక డిబ్రిస్ తీసివేయకుండా, చెత్తను జమ చేస్తున్నారని తెలిపారు. నల్ల చెరువులో నిన్న (ఆదివారం) కూల్చివేతలు చేపట్టిన స్థలం పట్టదారులకు చెందిందని.. పట్టాదారులకు ఏ విధమైన న్యాయం చేయనున్నారని ప్రశ్నించారు.
హైదరాబాద్ : హైడ్రా రికార్డు క్రియేట్ చేసింది. అమీన్ పూర్లో హైడ్రా బిగ్ ఆపరేషన్ చేపట్టింది. 17 గంటలపాటు నాన్ స్టాప్‌గా ఇళ్లులు, భవనాలు, అపార్టుమెట్లు కూల్చివేసింది. అలాగే ఓ హాస్పిటల్, రెండు అపార్ట్ మెంట్లు కూల్చివేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. పటేల్ గుడాలో 16 విల్లాలు కూల్చివేసింది.