Home » ICC
ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో టీమిండియా స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా ఇద్దరూ టాప్ ర్యాంకుల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో అశ్విన్ అగ్రస్థానంలో ఉండగా.. ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా టాప్‌లో కొనసాగుతున్నాడు.
ఐసీసీ ప్రకటించిన వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్‌పై టీం ఇండియా కెప్టెన్ రోహిత్ (Rohit Sharma) శర్మ స్పందిస్తూ "ఆట వేగంగా మారింది" కాబట్టి దేశంలో జరగబోయే వన్డే ప్రపంచ కప్ అత్యంత పోటీగా ఉంటుందని తెలిపాడు.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. మొత్తం 10 జట్లు పోటీ పడనున్న ఈ టోర్నీ అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19 జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది.
ఆరు నెలలుగా క్రికెట్ ఆడకపోయినప్పటికీ టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant ) టెస్ట్ ర్యాంక్‌కు ఢోకా లేకుండాపోయింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాకింగ్స్లో (ICC Rankings) పంత్ తన 10వ స్థానాన్ని నిలుపుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ ర్యాంకులో ఉన్న టీమిండియా(Team India) బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా టాప్ 10లో ఉన్న ఏకైక టీమిండియా బ్యాటర్ కూడా పంతే కావడం గమనార్హం.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 విజేత ( World Test Championship 2021-23) గెలుచుకోబోయే ప్రైజ్ మనీని (Prize money) ఐసీసీ (ICC) ప్రకటించింది. గత ఛాంపియన్షిప్ 2019-21 మాదిరిగానే 2021-23లో కూడా రూ.31.4 కోట్ల మొత్తాన్ని ప్రకటించింది.