Home » INDIA Alliance
లోక్సభ ఎన్నికల నాలుగో దశలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమియేతర పార్టీలపైనే పరిశీలకుల దృష్టి ప్రధానంగా ఉంది. త్రిశంకు సభ (హంగ్ పార్లమెంటు) ఏర్పడిన పక్షంలో (నెల రోజుల క్రితం కంటే ఇది ఇప్పుడు సంభావ్య పరిణామంగా కనిపిస్తోంది) ప్రభుత్వం ఏర్పాటులో ఈ ‘అలీన’ పార్టీలే కీలక పాత్ర వహించనున్నాయి.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు దశల వారీగా జరుగుతున్నా.. ఇప్పటికీ ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనేది క్లారిటీ రాలేదు. కొందరు బడా నేతల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి కానీ.. కూటమి మాత్రం ఇంతవరకూ..
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. 10 గ్యారంటీలు అమలు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశవ్యాప్తంగా మూడు దశల ఎన్నికలు ముగిశాయి.. సగం పైగా స్థానాల్లో పోలింగ్ అయిపోయింది..! మరి.. రాజకీయ వాతావరణం ఎలా ఉంది? బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిపై ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం పడునుందా? కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి గాలి వీస్తోందా? దీనిపై ఆ రెండు పక్షాలు తమతమ వాదనలు వినిపిస్తున్నాయి.
సార్వత్రిక సమరానికి మరి కొన్ని గంటలే మిగిలి ఉన్న వేళ.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ప్రజలకు విన్నవించారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ బీజేపీ నాయకుల మీద తాము చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని విపక్ష ఇండియా కూటమి నాయకులు ఎలక్షన్ కమిషన్ను కోరారు. మొదటి రెండు దశల పోలింగ్ వివరాల వెల్లడిలో జాప్యం జరగడంపైనా ఆందోళన వ్యక్తం చేశారు.
దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో గెలిచేదెవరు.. కేంద్రంలో అధికారం చేపట్టేదెవరు.. ఇప్పటికే మూడు విడతల్లో సగానికి పైగా లోక్సభ స్థానాల్లో(Lok Sabha Seats) ఎన్నికలు పూర్తయ్యాయి. మొదటి మూడు విడతల్లో ఎవరిది అధిపత్యం అనేదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. మొదటి మూడు విడతల్లో పోలింగ్ తక్కువ నమోదైంది. బీజేపీకి ఈ మూడు విడతల్లో ఎదురుదెబ్బ తగిలిందని ఇండియా కూటమి ఆరోపిస్తుంటే.. ఎన్డీయే(NDA) బలం గతంకంటే పెరిగింది.. ఇండియా కూటమికి గతంలో వచ్చిన సీట్లు రావంటూ బీజేపీ(BJP) చెబుతోంది. ఈ క్రమంలో మొదటి మూడు విడతల్లో ఎవరిది అధిపత్యం అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. మూడు విడతలు ఇప్పటికే ముగిశాయి. పోలింగ్ ముగిసిన మూడోవిడతలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం మహారాష్ట్రలోని బారామతి.. ఇక్కడ ఫ్యామిలీ వార్ నడుస్తుండగా.. విజయంపై ఉత్కంఠ నెలకొంది. ఎన్సీపీ, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీల మధ్య ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ నెలకొంది.
కాంగ్రెస్ పార్టీ ‘ఓట్ జిహాద్’ను ప్రోత్సహిస్తూ, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ముస్లింలను కోరుతోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. మధ్యప్రదేశ్లోని ధార్, ఖర్గోన్లలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలలో మోదీ ప్రసంగించారు. ‘‘భారతదేశంఈ రోజు ఒక కీలక మలుపు ముంగిట నిలిచింది. దేశంలో ఓట్ జిహాద్ కొనసాగాలా లేక, రామ రాజ్యం కొనసాగాలా అనేది మీరే నిర్ణయించుకోవాలి’’ అని ప్రజలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
లోక్సభ మొదటి, రెండో దశ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన పోలింగ్ శాతాల్లో భారీ వ్యత్యాసాలు ఉండడం ఆ సంస్థ నిష్పక్షపాతతపై అనుమానాలను కలిగిస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అన్నారు.