Share News

Mamatha Banerjee : ‘ఇండియా’కు బయట నుంచి మద్దతు..

ABN , Publish Date - May 16 , 2024 | 03:06 AM

ఇండియా కూటమి విషయంలో తృణమూల్‌ కాంగ్రె్‌స(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వరం మారింది. సీట్ల పంపకం అంశంలో కాంగ్రె్‌సతో వచ్చిన విభేదాల వల్ల ‘ఇండియా’కు దూరంగా ఉన్న ఆమె బుధవారం కూటమికి మద్దతుగా మాట్లాడారు. హుగ్లీ జిల్లాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మమత మాట్లాడుతూ.. 400 స్థానాల్లో గెలిచి మళ్లీ అధికారం చేపడతామంటూ బీజేపీ చెబుతున్న మాటలను తోసిపుచ్చారు.

Mamatha Banerjee : ‘ఇండియా’కు బయట నుంచి మద్దతు..

  • ఇది జాతీయ రాజకీయాలకే పరిమితం

  • బెంగాల్‌ కాంగ్రెస్‌, సీపీఐ కూటమిలో భాగం కాదు

  • టీఎంసీ అధ్యక్షురాలు, బెంగాల్‌ సీఎం మమత

కోల్‌కతా, మే 15 : ఇండియా కూటమి విషయంలో తృణమూల్‌ కాంగ్రె్‌స(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వరం మారింది. సీట్ల పంపకం అంశంలో కాంగ్రె్‌సతో వచ్చిన విభేదాల వల్ల ‘ఇండియా’కు దూరంగా ఉన్న ఆమె బుధవారం కూటమికి మద్దతుగా మాట్లాడారు. హుగ్లీ జిల్లాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మమత మాట్లాడుతూ.. 400 స్థానాల్లో గెలిచి మళ్లీ అధికారం చేపడతామంటూ బీజేపీ చెబుతున్న మాటలను తోసిపుచ్చారు. అంతేకాక, ఇండియా కూటమి కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన మద్దతును తాము బయటి నుంచి ఇస్తామని ప్రకటించారు. అయితే, బీజేపీతో కలిసి పని చేస్తున్న బెంగాల్‌ కాంగ్రెస్‌, సీపీఐ పార్టీలు తమ దృష్టిలో ఇండియా కూటమిలో భాగం కాదన్నారు. తమ మద్దతు జాతీయ రాజకీయాలకే పరిమితమని మమత స్పష్టం చేశారు.

Updated Date - May 16 , 2024 | 03:06 AM