Share News

Arvind Kejriwal: ‘ఇండియా’ ప్రధాని అభ్యర్థిపై కేజ్రీవాల్ క్లారిటీ.. అందుకు కూటమికి సారీ

ABN , Publish Date - May 12 , 2024 | 07:58 PM

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు దశల వారీగా జరుగుతున్నా.. ఇప్పటికీ ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనేది క్లారిటీ రాలేదు. కొందరు బడా నేతల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి కానీ.. కూటమి మాత్రం ఇంతవరకూ..

Arvind Kejriwal: ‘ఇండియా’ ప్రధాని అభ్యర్థిపై కేజ్రీవాల్ క్లారిటీ.. అందుకు కూటమికి సారీ

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు దశల వారీగా జరుగుతున్నా.. ఇప్పటికీ ‘ఇండియా’ కూటమి (INDIA Alliance) ప్రధాని అభ్యర్థి ఎవరనేది క్లారిటీ రాలేదు. కొందరు బడా నేతల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి కానీ.. కూటమి మాత్రం ఇంతవరకూ అధికారికంగా ఏదీ వెల్లడించడం లేదు. ఇప్పుడు ఈ కూటమిలో భాగస్వామి అయిన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాక జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, పది గ్యారెంటీలను ప్రకటించడంతో.. కూటమి ప్రధాని అభ్యర్థి బరిలో ఉన్నారా? అనే సందేహాలు తలెత్తాయి. తాజాగా కేజ్రీవాల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు.

ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ ‘న్యూక్లియర్’ వార్నింగ్

ఆదివారం ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన అనంతరం కేజ్రీవాల్ ప్రెస్‌మీట్ నిర్వహించినప్పుడు.. ‘కూటమి ప్రధాని అభ్యర్థి రేసులో మీరు ఉన్నారా?’ అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఆయన బదులిస్తూ.. తాను ప్రధాని అభ్యర్థి రేసులో లేనని క్లారిటీ ఇచ్చారు. ఇంకా మాట్లాడుతూ.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, తమ ఆప్ ఇచ్చిన గ్యారెంటీలను తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అయితే.. తాను ప్రకటించిన 10 గ్యారెంటీల గురించి తాను కూటమి మిత్రపక్షాలతో చర్చించలేదని, అయినా ఈ గ్యారెంటీలతో వారికి ఎలాంటి సమస్య ఉండదని తాను నమ్ముతున్నానని అన్నారు. ఈ గ్యారెంటీలు తప్పకుండా నెరవేరేలా చూస్తానని ఉద్ఘాటించారు.


ప్రధాని మోదీకి సీఎం కౌంటర్.. ఆ హామీల సంగతేంటి?

ఈ 10 గ్యారెంటీల గురించి ఇండియా కూటమి పక్షాలతో చర్చించనందుకు.. కేజ్రీవాల్ వారిని చేతులెత్తి క్షమాపణలు అడిగారు. ఇప్పుడు అంతగా సమయం లేదని, ఇప్పటికే సగం ఎన్నికలు ముగిశాయని, అందుకే వారితో చర్చించకుండా ఈ గ్యారెంటీలను ప్రకటించానని చెప్పారు. అయితే.. ఈ గ్యారెంటీలతో వారికెలాంటి అభ్యంతరం ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. ఈ పది హామీలు అమలయ్యేలా చూస్తానన్నారు. మోడీ హామీలను నమ్మాలా? లేక కేజ్రీవాల్ హామీలను నమ్మాలా? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. గతంలో తామిచ్చిన హామీలను పూర్తి చేసిన విషయాన్ని కేజ్రీవాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

వైసీపీ దుష్ప్రచారం.. పథకాల్లేవంటూ చంద్రబాబు ‘ఫేక్ ఆడియో’ వైరల్

‘‘మేము ముందస్తు ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీలన్నింటినీ నెరవేర్చాం. వచ్చే ఏడాదిలో ప్రధాని మోదీ పదవీ విరమణ చేస్తారు. ఆ తర్వాత ఆయన హామీలను ఎవరు నెరవేరుస్తారనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. కానీ.. కేజ్రవాల్ ఇక్కడే ఉన్నాడు, నేను హామీలు నెరవేరేలా చూస్తాను’’ అని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. తాను ప్రకటించిన పది హామీలు నవ భారతదేశానికి ఒక విజన్ అని.. వీటిలో కొన్ని పనులను గత 75 ఏళ్లలోనే చేయాల్సినవని.. కానీ ఎవ్వరూ చేయలేకపోయారని అన్నారు. తమ కూటమి అధికారంలోకి వస్తే.. యుద్ధ ప్రాతిపదికన ఆ పనులన్నీ చేపడతామని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 12 , 2024 | 08:01 PM