Home » India tour of west indies2023
టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్నపెద్ద అనే తేడా లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా అంతటా కోహ్లీ అభిమానులు ఉంటారు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో చేసిన రన్స్ ద్వారా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ చరిత్రలో 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌తో (West Indies vs India 2nd Test) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్ ఆడడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచ్‌లను (500 Matches) పూర్తి చేసుకున్నాడు. దీంతో 500 మ్యాచ్‌ల క్లబ్‌లో చేరిన 4వ భారత క్రికెటర్‌గా.. మొత్తంగా 10వ ఆటగాడిగా నిలిచాడు.
భారత్‌తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో అతిథ్య జట్టు వెస్టిండీస్ టాస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. బౌలింగ్ యూనిట్‌లో పేసర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో ముఖేష్ కుమార్‌ను తుది జట్టులోకి తీసుకుంది. దీంతో ముఖేష్ కుమార్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేంట్రం చేశాడు.
మరికాసేపట్లో భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ గెలిచిన ఊపులో ఉన్న భారత జట్టు రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుతం రోహిత్ సేన అన్ని విధాల బలంగా ఉంది. స్థాయి తగ్గ ప్రదర్శన కనబరిస్తే గెలుపు పెదగా కష్టం కాకపోవచ్చు.
గురువారం నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ రెండో టెస్ట్ మ్యాచ్‌తో భారత్, వెస్టిండీస్ (West Indies vs India) జట్ల మధ్య 100 టెస్ట్ మ్యాచ్‌లు పూర్తి కానున్నాయి. అంటే సెంచరీ పూర్తి కానుంది.
భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 20 నుంచి జరగనుంది. ఇప్పటికే మ్యాచ్ వేదికైన ట్రినిడాడ్ చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ వేదికైనా క్వీన్స్ పార్క్‌లో గత రికార్డులు ఎలా ఉన్నాయి? ఈ పిచ్‌పై భారత జట్టు గతంలో ఆడిన మ్యాచ్‌ల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయనే అంశంపై ఆసక్తి నెలకొంది.
మొదటి టెస్ట్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న రోహిత్ సేన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకున్న సిరీస్ భారత్‌కే దక్కుతుంది. దీంతో ఈ మ్యాచ్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే దృష్టిపెట్టింది. ఈ క్రమంలో రెండో టెస్ట్‌కు భారత జట్టు ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందనే అనే ఆసక్తి అందరిలో నెలకొంది.