Viral Video: విరాట్ కోహ్లీ మీద అభిమానంతో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ తల్లి ఏం చేసిందో చూడండి!..

ABN , First Publish Date - 2023-07-22T21:06:02+05:30 IST

టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్నపెద్ద అనే తేడా లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా అంతటా కోహ్లీ అభిమానులు ఉంటారు.

Viral Video: విరాట్ కోహ్లీ మీద అభిమానంతో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ తల్లి ఏం చేసిందో చూడండి!..

టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్నపెద్ద అనే తేడా లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా అంతటా కోహ్లీ అభిమానులు ఉంటారు. టీమిండియాను ద్వేషించే పాకిస్థాన్ వంటి దేశాల్లో సైతం కోహ్లీకి అభిమానులు ఉన్నారు. విరాట్ కోహ్లీని ఇతర క్రికెటర్ల తల్లిదండ్రులు కూడా అభిమానిస్తుంటారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీకి వెస్టిండీస్ వికెట్ కీపర్ జాషువా డి సిల్వా తల్లి వీరాభిమాని. చాలా కాలంగా ఆమె కోహ్లీని అభిమానిస్తోంది. ఆమె కోహ్లీని కలుసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటోంది. ఈ క్రమంలోనే డొమినికా వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట అనంతరం డిసిల్వా తల్లి విరాట్ కోహ్లీని కలుసుకుంది. దీనికి సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా వైరల్‌గా మారింది. వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం భారత ఆటగాళ్లు తమ హోటల్‌కు తిరిగి వెళ్తున్నప్పుడు బస్సు దగ్గర డిసిల్వా తల్లి విరాట్ కోహ్లీని కలుసుకుంది. కోహ్లీని చూసి మురిసిపోయిన డిసిల్వా తల్లి అతన్ని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది. ఆ సమయంలో డిసిల్వా తల్లి భావోద్వేగానికి గురైంది.


అనంతరం డిసిల్వా తల్లి మాట్లాడుతూ "మొదటిసారి కోహ్లీని కలిశాను. అతను అద్భుతమైన వ్యక్తి. చాలా ప్రతిభావంతుడు. కోహ్లీని కౌగిలించుకోవడం ఒక గౌరవం. నేను కోహ్లీని కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. విరాట్ కోహ్లి నా జీవితకాలంలో నేను చూసిన అత్యుత్తమ బ్యాటర్. విరాట్ కోహ్లీలా నా కుమారుడు కూడా ఆడాలని కోరుకుంటున్నాను" అని ఆమె తెలిపింది. వాళ్ల అమ్మ ఫోన్ చేసి తాను కోహ్లీని చూసేందుకు వస్తున్నానని చెప్పినప్పుడు తాను షాకయ్యానని డిసిల్వా చెప్పాడు. తన తల్లి తన ఆట కాకుండా విరాట్ కోహ్లీ ఆటను చూడడానికి వచ్చిందని, ఆమె కోహ్లీ వీరాభిమాని అని డిసిల్వా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - 2023-07-22T21:06:02+05:30 IST