IND vs WI 2nd Test: చరిత్ర సృష్టించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా..

ABN , First Publish Date - 2023-07-20T21:59:59+05:30 IST

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో చేసిన రన్స్ ద్వారా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ చరిత్రలో 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.

IND vs WI 2nd Test: చరిత్ర సృష్టించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా..

ట్రినిడాడ్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో చేసిన రన్స్ ద్వారా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ చరిత్రలో 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. కాగా 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హిట్‌మ్యాన్ ఈ రికార్డును అందుకున్నాడు. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 25 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 40 ఇన్నింగ్స్‌ల్లో 2 వేలకుపైగా పరుగులు చేశాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ.. ఓపెనర్‌గా 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్‌గా రోహిత్ సగటు 53గా ఉంది.


ఇక తొలి రోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(63), యశస్వి జైస్వాల్(52) క్రీజులో ఉన్నారు. 26 ఓవర్లపాటు సాగిన మొదటి సెషన్‌లో భారత ఓపెనర్లు ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఆరంభంలో నిదానంగా ఆడినప్పటికీ క్రీజులో కుదురుకున్నాక విండీస్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ 74 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కాగా టెస్టుల్లో రోహిత్‌కు ఇది 15వ హాఫ్ సెంచరీ. హిట్‌మ్యాన్ సిక్సు కొట్టి మరి హాఫ్ సెంచరీ మార్కును అందుకోవడం గమనార్హం. ఇక వన్డే స్టైలులో బ్యాటింగ్ చేసిన జైస్వాల్ 49 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొదటి సెషన్ చివరి ఓవర్లో జైస్వాల్ స్లిప్‌లోకి ఇచ్చిన క్యాచ్‌ను విండీస్ ఫీల్డర్లు వదిలేశారు. దీంతో జైస్వాల్ ఔట్ అయ్యే ప్రమాదం నుంచి బయపడ్డాడు.

Updated Date - 2023-07-20T21:59:59+05:30 IST