Home » India vs Australia
టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియా ఈ టోర్నీలోనే అసలు సిసలైన మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు పాకిస్తాన్ తప్ప అన్నీ చిన్న జట్లతోనే తలపడింది. తొలిసారి కంగారూలను ఢీకొట్టబోతోంది.
ఈ ఏడాది చివరలో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడనున్నాయి. 1992 తర్వాత భారత్, ఆస్ట్రేలియా జట్లు 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడడం ఇదే తొలిసారి.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్లను వరుసగా టెస్టు మ్యాచ్‌ల్లో ఓడించిన భారత అమ్మాయిలు ప్రస్తుతం కంగారులతో వన్డే సిరీస్‌కు సిద్ధమయ్యారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియా ఉమెన్స్, ఆస్ట్రేలియా ఉమెన్స్ మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది.
India vs Australia: ప్రస్తుతం భారత మహిళల జట్టు మంచి ఫామ్‌లో ఉంది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత జట్టు టెస్టు ఫార్మాట్‌లో వరుసగా బలమైన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లను ఓడించింది. ఇదే ఊపులో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల్లోనూ సత్తా చాటాలని మన అమ్మాయిలు భావిస్తున్నారు.
Harmanpreet kaur: టీమిండియా ఉమెన్స్, ఆస్ట్రేలియా ఉమెన్స్ మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సహనం కోల్పోయింది. ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంపైర్‌కు అప్పీల్‌కు చేసింది. అసలు ఏం జరిగిందంటే.. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 80వ ఓవర్‌ను హర్మన్ ప్రీత్ కౌర్ బౌలింగ్ చేసింది.
Suryakumar Yadav: ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. చివరి ఓవర్లో ఆస్ట్రేలియా విజయానికి 10 పరుగులు మాత్రమే అవసరం కాగా టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో భాగంగా.. శుక్రవారం (01/12/23) ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మన భారత బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్లు తిప్పేయడంతో.. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా..
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ-20 సిరీస్‌కు ఆదరణ లేకపోవడానికి కారణమేంటో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ తెలిపారు. ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఈ సిరీస్ నిర్వహించడం చాలా తప్పిదమని, వరుస గేమ్‌లు క్రికెట్లోని మజాను చంపేస్తున్నాయని హస్సీ అభిప్రాయపడ్డాడు.
టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ మరికొంత కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో ప్రారంభం కాబోయే దక్షిణాఫ్రికా పర్యటనలో హెడ్ కోచ్‌గా ఉండాలని ఇప్పటికే రాహుల్ ద్రావిడ్‌ను బీసీసీఐ కోరినట్లుగా తెలుస్తోంది. అలాగే ద్రావిడ్ కాంట్రాక్ట్‌ను మరో రెండేళ్లు పెంచే అవకాశాలున్నాయని పలు జాతీయ క్రీడా వెబ్‌సైట్స్ పేర్కొంటున్నాయి.
ఆస్ట్రేలియాతో ముగిసిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ దారుణంగా విఫలమయ్యాడు. 4 ఓవర్లలో ఏకంగా 68 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో ఏకంగా 23 పరుగులిచ్చి టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. ఈ క్రమంలో ప్రసిద్ధ్ కృష్ణ ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు.