Share News

IND v AUS: సంప్రదాయం ప్రకారం ట్రోఫి ఎత్తిన కుర్రాళ్లు.. టీమిండియాలో ఇది ప్రవేశపెట్టింది ఎవరంటే..?

ABN , First Publish Date - 2023-12-04T08:10:56+05:30 IST

Suryakumar Yadav: ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. చివరి ఓవర్లో ఆస్ట్రేలియా విజయానికి 10 పరుగులు మాత్రమే అవసరం కాగా టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

IND v AUS: సంప్రదాయం ప్రకారం ట్రోఫి ఎత్తిన కుర్రాళ్లు.. టీమిండియాలో ఇది ప్రవేశపెట్టింది ఎవరంటే..?

బెంగళూరు: ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. చివరి ఓవర్లో ఆస్ట్రేలియా విజయానికి 10 పరుగులు మాత్రమే అవసరం కాగా టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన వేడ్ వికెట్ సాధించాడు. దీంతో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 4-1తో కైవసం చేసుకుంది. అక్షర్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, రవి బిష్ణోయ్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.


అనంతరం కెప్టెన్‌గా ట్రోఫిని అందుకున్న సూర్యకుమార్ యాదవ్ చాలా కాలంగా భారత జట్టులో ఉన్న సంప్రదాయాన్ని కొనసాగించాడు. తొలి సారి సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యువ ఆటగాళ్లు జితేష్ శర్మ, రింకూ సింగ్ చేతికి ట్రోఫి అందించాడు. దీంతో జితేష్, రింకూ ట్రోఫిని ఎత్తారు. వీరిద్దరు గతంలో కూడా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ సీనియర్ జట్టులో ఆడడం ఇదే మొదటిసారి. సిరీస్ గెలిచినప్పుడు జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వహించిన యువ ఆటగాళ్ల చేతితో ట్రోఫి ఎత్తించడమనే సంప్రదాయం టీమిండియాలో చాలా కాలంగా ఉంది. మొట్టమొదటి సారిగా 2007లో అప్పటి టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. ఆ తర్వాతి నుంచి ఈ సంప్రదాయాన్ని ధోని తర్వాతి కెప్టెన్లు కూడా పాటిస్తున్నారు. ధోని తర్వాత టీమిండియా కెప్టెన్లు అయినా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్ తదితరులు ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు.

Updated Date - 2023-12-04T08:14:26+05:30 IST