Home » India vs Australia
మరికాసేపట్లో వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రపంచకప్ ట్రోఫీ కోసం అతిథ్య భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వనుంది.అసలు టేబుల్‌పై రెండు జట్ల బలబలాలు ఎలా ఉన్నాయి? బలహీనతలేంటి? ప్రపంచకప్ గెలిచే సత్తా ఉన్న జట్టు ఏదనే అంశాలని ఒకసారి పరిశీలిద్దాం.
మరికొన్ని గంటల్లో ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్‌ల్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. వరల్డ్ కప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలని భారత్.. రికార్డు స్థాయిలో ఆరోసారి ఎగరేసుకు పోవాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతున్నాయి.
World Cup Final: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రపంచకప్ ట్రోఫీ కోసం తుది పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుసగా 10 విజయాలతో ఫైనల్‌లో అడుగుపెట్టిన టీమిండియా తుది పోరులోనూ గెలిచి మూడో సారి ప్రపంచకప్ ట్రోఫీని గెలవాలని పట్టుదలగా ఉంది.
రోహిత్‌ను ఇంగ్లండ్ మాజీ సారథి నాసిర్ హుస్సేన్ ఆకాశానికెత్తేశాడు. ఈ వరల్డ్ కప్‌లో బెరుకులేని క్రికెట్ ఆడుతూ జట్టు సంస్కృతిని సమూలంగా మార్చి వేసిన రోహిత్‌ను రియల్ హీరోగా కొనియాడాడు...