Share News

World Cup: IND vs AUS ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ చేరుకున్న ప్రముఖులు వీళ్లే!

ABN , First Publish Date - 2023-11-19T12:45:49+05:30 IST

IND vs AUS Final: క్రికెట్ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగే ఈ ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. లక్ష 30 వేల మంది అభిమానుల కేరింతల మధ్య ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనేక మంది ప్రముఖులు సైతం స్టేడియానికి తరలివస్తున్నారు.

World Cup: IND vs AUS ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ చేరుకున్న ప్రముఖులు వీళ్లే!

అహ్మదాబాద్: క్రికెట్ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగే ఈ ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. లక్ష 30 వేల మంది అభిమానుల కేరింతల మధ్య ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనేక మంది ప్రముఖులు సైతం స్టేడియానికి తరలివస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. వీరితోపాటు క్రికట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పలువురు సెలబ్రెటీలు స్టేడియానికి తరలివస్తున్నారు. సచిన్ టెండూల్కర్ ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నారు. బాలీవుడ్ నటులు రణ్‌వీర్ సింగ్, నటి దీపికా పదుకొణె, ఊర్వశి రతౌలా, కూడా అహ్మదాబాద్ చేరుకునున్నారు. దీపికా, రణవీర్‌ స్టేడియానికి చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రణ్‌వీర్ సింగ్ టీమిండియా జెర్సీలో కనిపించారు. మరికొంత మంది ప్రముఖులు కూడా మోదీ స్టేడియానికి చేరుకుంటున్నారు.


ఇక టీమిండియా జట్టు కూడా ఫైనల్ మ్యాచ్ జరిగే నరేంద్ర మోదీ స్టేడియానికి చేరుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీతో సహా మొత్తం జట్టు స్టేడియంలో అడుగుపెట్టింది. టీమ్‌తో పాటు ప్రేక్షకుల భద్రత కోసం వేలాది మంది పోలీసులను మోహరించారు. టీమిండియా కప్ గెలవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ప్రార్థనలు చేస్తున్నారు. ఉదయం ఆలయాలలో పూజలు ప్రారంభించారు. టీమిండియా ప్రపంచకప్ గెలవాలని ఆంధ్రప్రదేశ్‌లోని అయ్యప్పస్వాములు పూజలు నిర్వహించారు. టీమిండియా క్రికెటర్ల ఫోటోతోపాటు దేవుళ్ల ఫోటోను పెట్టి పూజలు చేశారు. మరోవైపు మ్యాచ్ జరిగే నరేంద్ర మోదీ స్టేడియం వద్ద పండగ వాతావరణం నెలకొంది. లక్షకు పైగా అభిమానులు స్టేడియం వద్దకు వస్తుండడంతో ఆ ప్రాంతమంతా కేరింతలతో మార్మోగిపోతుంది. స్టేడియం పరిసరాలు మొత్తం బ్లూమయంగా మారిపోయాయి. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నప్పటికీ ఉదయం నుంచే అభిమానులు స్టేడియానికి పొటెత్తారు.

Updated Date - 2023-11-19T12:54:20+05:30 IST