Home » India
ఇంతకీ మన దేశం పేరు ‘ఇండియా’నా లేక ‘భారత్’ ఆ జీ20 సదస్సు (G20 Summit) డిన్నర్ ఆహ్వానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డిన్నర్ ఆహ్వానంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులు ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా పేర్కొనడమే ఇందుకు కారణమైంది. ఇండియా పేరును భారత్‌గా మార్చబోతున్నారంటూ విపక్షాల నేతలు దేశవ్యాప్తంగా మండిపడుతున్నారు.
ఇండియా అంటే బానిసత్వ చిహ్నమని చెప్తూ, ప్రాచీన కాలంనాటి పేరు అయిన ‘భారత్’ను తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ప్రచారం ఊపందుకోవడంతో వివిధ రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చబోతున్నట్లు విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారనే ప్రచారం జరుగుతోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో సంచలనం సృష్టించబోతున్నట్లు కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ, డిజిటల్ ఇండియా, చంద్రయాన్-3 వంటివాటి సరసన దేశం పేరు మార్పు కూడా జత కలవబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 9న రాష్ట్రపతి భవన్‌లో విందు ఇస్తున్నారని, ఈ విందుకు హాజరుకావాలని కోరుతూ అతిథులకు పంపిన ఆహ్వాన పత్రికల్లో మన దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అని పేర్కొన్నారని మండిపడింది.
దేశవ్యాప్తంగా లోక్ సభ, శాసన సభల ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలనే ఆలోచన సరైనది కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఈ విధంగా ఎన్నికలను నిర్వహించడం ఇండియన్ యూనియన్‌పైనా, దానిలోని అన్ని రాష్ట్రాలపైనా దాడి చేయడమేనని చెప్పారు.
మన దేశం జీ20 ప్రెసిడెన్సీని చేపట్టడంతో అనేక సకారాత్మక ప్రభావాలు కనిపిస్తున్నాయని, వీటిలో కొన్ని తన మనసుకు చాలా దగ్గరయ్యాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆలోచనల వేదిక స్థాయి నుంచి భవిష్యత్తుకు మార్గసూచిగా భారత్ నాయకత్వంలో జీ20 మారిందని తెలిపారు.
అభివృద్ధి చెందిన, చెందుతున్న 20 దేశాల కూటమి సమావేశానికి దేశ రాజధాని నగరం చకచకా ముస్తాబవుతోంది. ప్రగతి మైదానంలో ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే సమావేశాల్లో పాల్గొనే వివిధ దేశాల నేతలు, అధికారులకు రుచికరమైన భారతీయ స్ట్రీట్ ఫుడ్అం దించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
‘ఒక భూమి-ఒకే కుటుంబం’ ఇతివృత్తంతో జరుగుతున్న జీ20 సదస్సు చిరకాలం గుర్తుండిపోయేలా చేయడం కోసం భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ గ్రూప్‌లోని 20 దేశాలకు సంబంధించిన కనీసం ఒక కళాఖండం ఉండేలా ఓ డిజిటల్ మ్యూజియంను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది.
మన దేశం హిందూ దేశమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య తీవ్రంగా ఖండించారు. భారత దేశం ఇప్పుడు, గతంలో హిందూ దేశం కాదని చెప్పారు. ఇండియా సహజంగానే బహుళత్వంగల దేశమని చెప్పారు.