Hindu Rashtra : ఇండియా హిందూ దేశం కాదు : సమాజ్‌వాదీ పార్టీ నేత

ABN , First Publish Date - 2023-09-02T13:42:45+05:30 IST

మన దేశం హిందూ దేశమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య తీవ్రంగా ఖండించారు. భారత దేశం ఇప్పుడు, గతంలో హిందూ దేశం కాదని చెప్పారు. ఇండియా సహజంగానే బహుళత్వంగల దేశమని చెప్పారు.

Hindu Rashtra : ఇండియా హిందూ దేశం కాదు : సమాజ్‌వాదీ పార్టీ నేత
Swamy Prasad Maurya , Mohan Bhagawat

లక్నో : మన దేశం హిందూ దేశమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య తీవ్రంగా ఖండించారు. భారత దేశం ఇప్పుడు, గతంలో హిందూ దేశం కాదని చెప్పారు. ఇండియా సహజంగానే బహుళత్వంగల దేశమని చెప్పారు.

మోహన్ భగవత్ నాగపూర్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, హిందుస్థాన్ అనేది హిందూ దేశమని చెప్పారు. సిద్ధాంతపరంగా భారతీయులంతా హిందువులేనన్నారు. హిందువులంటే భారతీయులని చెప్పారు. నేడు భారత దేశంలో ఉన్నవారంతా హిందూ సంస్కృతికి, హిందూ పూర్వీకులకు, హిందూ భూమికి చెందినవారేనన్నారు. ఈ విషయాన్ని కొందరు అర్థం చేసుకున్నప్పటికీ, అమలు చేయడం లేదని, దీనికి కారణం వారి అలవాట్లు, స్వార్థపరత్వమేనని చెప్పారు. ఆరెస్సెస్ భావజాలానికి ప్రత్యామ్నాయం లేదని, అందువల్ల దానిని ప్రపంచవ్యాప్తంగా కోరుకుంటున్నారని తెలిపారు. అందరూ దీనిని గుర్తించారని, అయితే ‘కొందరు ధ్రువీకరిస్తారు, మరికొందరు ఆ పని చేయరు’ అన్నారు. స్వదేశీ కుటుంబ విలువలు, క్రమశిక్షణపై సమష్టిగా దృష్టి సారించవలసిన అవసరం ఉందన్నారు.

సకల్ జైన్ సమాజ్ గువాహటిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ, మన దేశాన్ని భారత్ అని ప్రాచీన కాలం నుంచి పిలుస్తున్నారని, అందువల్ల ఇండియాకు బదులుగా భారత్ అని పిలవాలని చెప్పారు. ‘‘ప్రాచీన కాలం నుంచి మన దేశం పేరు భారత్. ఏ భాష అయినప్పటికీ పేరు ఇదే’’నని చెప్పారు. అన్ని రంగాల్లోనూ ఇండియా అనే పదానికి బదులుగా భారత్ అనే పదాన్ని ఉపయోగించాలన్నారు. భారత్ అనే పదాన్ని ఉపయోగించినపుడు మాత్రమే మార్పు వస్తుందన్నారు. మనం మన దేశాన్ని భారత్ అని పిలవాలని, ఇతరులకు కూడా దీని గురించి వివరించి చెప్పాలని అన్నారు.

ఈ నేపథ్యంలో స్వామి ప్రసాద్ మౌర్య శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశం ఇప్పుడు, గతంలో హిందూ దేశం కాదని చెప్పారు. ఇండియా సహజంగానే బహుళత్వంగల దేశమని చెప్పారు. లౌకిక రాజ్య భావన ఆధారంగా మన రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. ఇండియాలో ఉన్నవారంతా ఇండియన్స్ అన్నారు. ఇండియన్ రాజ్యాంగం అన్ని మతాలు, విశ్వాసాలు, వర్గాలు, సంస్కృతులకు ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు.


ఇవి కూడా చదవండి :

Supreme Court : తల్లిదండుల పెళ్లి చెల్లకపోయినా పిల్లలకు వారసత్వ హక్కు ఉంటుంది : సుప్రీంకోర్టు

RSS : మన దేశాన్ని ‘భారత్’ అని పిలవాలి : మోహన్ భగవత్

Updated Date - 2023-09-02T13:42:45+05:30 IST