Home » India
భారత దేశం క్రమంగా ఎదుగుతున్న తీరును విదేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. కోవిడ్-19కు టీకాను సొంతంగా అభివృద్ధి చేసి, 130 కోట్ల మంది భారతీయులకు టీకాకరణ చేయడంలో విజయవంతమవడం దగ్గర నుంచి చంద్రయాన్-3 చంద్రునిపై అడుగు పెట్టడం వరకు అన్నిటినీ పరిశీలిస్తున్నాయి.
భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రశాంతంగా, సోదరుల్లా కలిసి ఉందామని భారత్ అభ్యర్థిస్తే.. పాక్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటుంది...
పూర్వ సంస్కృతికి భౌతిక విలువ ఉందని, అంతేకాకుండా అది దేశ చరిత్ర, గుర్తింపు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. తమ సాంస్కృతిక వారసత్వ సంపదకు చేరువై, ఆస్వాదించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు.
బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల నేతలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత ఆకర్షణీయమైన బహుమతులను ఇచ్చారు. భారత దేశ సంస్కృతి, వారసత్వాల ఔన్నత్యాన్ని ఈ బహుమతులు ప్రతిబింబిస్తున్నాయి. వీటిలో తెలంగాణలో ప్రసిద్ధి పొందిన సురహి కూడా ఉంది.
బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో భారత దేశం చేసిన విజ్ఞప్తి మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జీ జిన్‌పింగ్ చర్చలు జరిపారని చైనా విడుదల చేసిన ప్రకటనను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. ద్వైపాక్షిక సమావేశానికి చైనా చేసిన విజ్ఞప్తిపై భారత దేశం నిర్ణయం తీసుకోవలసి ఉందని తెలిపింది.
భారత్-చైనా మధ్య సత్సంబంధాలు మెరుగుపడటం వల్ల ఇరు దేశాలతోపాటు ప్రజల ఉమ్మడి ప్రయోజనాలకు మేలు జరుగుతుందని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చెప్పారు. ఇది ప్రపంచ, ఈ ప్రాంత అభివృద్ధి, శాంతి, సుస్థిరతలకు దోహదపడుతుందని తెలిపారు.
ఎన్నికలు సకాలంలో నిర్వహించడంలో విఫలమైనందుకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)పై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సస్పెన్షన్ వేటు విధించింది. ఈ నిర్ణయం గురువారం నుంచే తక్షణమే అమలులోకి వచ్చేలా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది.
చంద్రయాన్-3 విజయవంతమవడంతో మన దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రయోజనాలు చేకూరబోతున్నాయి. 2025 నాటికి మన దేశ రోదసి ఆర్థిక వ్యవస్థ విలువ 13 బిలియన్ డాలర్లు ఉండవచ్చునని అంచనా. స్టార్టప్ కంపెనీలకు పెట్టుబడులతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని చెప్తున్నారు.
బ్రిక్స్ జట్టులోకి మరో ఆరు దేశాలు చేరబోతున్నాయి. ఈ జట్టును విస్తరించేందుకు ప్రస్తుత సభ్య దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, భారత దేశం, దక్షిణాఫ్రికా ఏకాభిప్రాయంతో అంగీకరించాయి. సభ్య దేశాల మధ్య సహకారం మరింత పెరగడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచనలు చేశారు.
చంద్రయాన్ మిషన్ ఇక్కడితో ఆగిపోయేది కాదు. చంద్రయాన్-3 తర్వాత చంద్రయాన్-4 ప్రయోగాన్ని కూడా ఇస్రో త్వరలో చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును జపాన్‌తో కలిసి భారత్ చేపడుతుందని సమాచారం. ఈ ప్రాజెక్టుకు చంద్రయాన్-4 లేదా లుపెక్స్ అని నామకరణం చేసే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు తెలియజేశాయి.