Home » IndiaVsAustralia
World Cup prize money: దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను విపరీతంగా అలరించిన వన్డే ప్రపంచకప్ ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరో సారి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. టీమిండియా రన్నరఫ్‌గా నిలిచింది. విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ట్రోఫీతోపాటు 4 మిలియన్ డాలర్ల పైజ్ మనీని గెలచుకుంది.
Player of the Tourney: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ టోర్నీకి తెరపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు సూపర్ ఫామ్‌లో ఉండడంతో ఫైనల్ పోరు ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో సమవుజ్జీలైన భారత్, ఆస్ట్రేలియా మధ్య పోరు కావడంతో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఐసీసీ ముగింపు వేడుకలను నిర్వహించనుంది.
World cup 2023: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లోనే ప్రారంభంకానుంది. తుది పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. లక్ష 30 వేల మంది ప్రేక్షకుల సిట్టింగ్ సామర్థ్యం గల అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Mitchell Marsh Prediction: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో అతిథ్య జట్టు టీమిండియా, ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన ఆస్ట్రేలియా తలపడనున్నాయి. స్టార్ క్రికెటర్ మిచెల్ మార్ష్ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం భారత అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
పిచ్ చాలా స్లోగా ఉందని, కాసేపు టెస్టు మ్యాచ్ ఆడినట్లుగా ఆడమని విరాట్ కోహ్లీ తనకు సూచించాడని కేఎల్ రాహుల్ చెప్పాడు. రెండు పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయినప్పుడు తాను క్రీజులోకి వచ్చానని, అయితే ఆ సమయంలో తాను మరి ఎక్కువగా కంగారు పడలేదని తెలిపాడు.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి ప్రవేశించి ఆటంకం కల్గించిన జార్వోకి ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. అతను ఈ ప్రపంచకప్‌లోని మరే మ్యాచ్‌కు హాజరుకాకుండా నిషేధం విధించింది.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో రాహుల్ క్రీజులోకి వచ్చాడు.
ఆస్ట్రేలియాపై విజయంతో వన్డే ప్రపంచకప్‌ను టీమిండియాగా ఘనంగా ప్రారంభించింది. కేవలం 200 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన వేళ.. స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 97 నాటౌట్), విరాట్ కోహ్లీ (116 బంతుల్లో 6 ఫోర్లతో 85)ల అసాధారణ ఆటతీరుతో వహ్వా.. అనిపించారు.
జార్వో ఈ పేరు గుర్తుందా. ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదూ!.. అదేనండి 2021లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో వచ్చి అందరినీ షాక్‌కు గురి చేశాడు. అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు.