Home » IndiaVsEngland
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటు జట్టు కెప్టెన్‌గా, అటు బ్యాటర్‌గా సత్తా చాటుతున్నాడు. తన నాయకత్వ ప్రతిభతో జట్టుకు అద్భుత విజయాలు అందిచడంతోపాటు బ్యాటుతోనూ టీంకు మంచి ఆరంభాలను అందిస్తున్నాడు.
సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ దుమ్ములేపుతున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. బజ్‌బాల్ వ్యూహం అంటూ భారత్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌కు అదే తరహా ఆట తీరుతో చుక్కలు చూపిస్తున్నాడు.
సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ దుమ్ములేపుతున్నాడు. రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో 90కి పైగా సగటుతో పరుగులు సాధించాడు.
టీమిండియాతో ఐదో టెస్టు మ్యాచ్‌లో పర్యాటక జట్టు ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ వేయగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టేల్స్ చెప్పాడు. టాస్ టేల్స్ పడడంతో టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు.
ఐదు టెస్టుల సిరీస్‌ను ఇప్పటికే 3-1తో గెలుచుకుని ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా చివరి టెస్టు మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. సాధారణంగా అయితే టీమిండియా ఇప్పటికే సిరీస్ గెలవడంతో ఈ మ్యాచ్‌కు అంతగా ప్రాధాన్యత ఉండదు.
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్టు మ్యాచ్‌తో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌లో 100 టెస్టు మ్యాచ్‌లు పూర్తి చేసుకోబోతున్నాడు. దీంతో 100 టెస్టులు ఆడిన 14వ భారత క్రికెటర్‌గా నిలవబోతున్నాడు.
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నారు. ధర్మశాల వేదికగా జరిగే ఐదో టెస్టు మ్యాచ్ ద్వారా వీరిద్దరు తమ తమ వ్యక్తిగత కెరీర్‌లో 100 టెస్టుల మైలురాయిని చేరుకోబోతున్నారు.
శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల సెంట్రల్ కాంట్రాక్టులను రద్దు చేసి భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) సరైన నిర్ణయం తీసుకుందని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. బీసీసీఐ కాంట్రాక్టు కలిగి ఉన్న ఆటగాళ్లు తప్పనిసరిగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలని ఆయన చెప్పాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ దుమ్ములేపుతున్నాడు. 22 ఏళ్ల వయసులోనే రికార్డులన్నింటిని బద్దలుకొడుతున్నాడు. వరుస డబుల్ సెంచరీలతో సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు దుమ్మలేపుతోంది. వరుసగా 3 టెస్టులు గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓడినప్పటకీ ఆ తర్వాత టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. గాయాలు, ఇతర కారణాలతో కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైనప్పటికీ రోహిత్ శర్మ సారథ్యంలోని యువ జట్టు అదరగొట్టింది.