IND vs ENG: వందో టెస్టులో కుంబ్లే, షేన్ వార్న్ రికార్డులను అశ్విన్ బద్దలుకొడతాడా?..
ABN , Publish Date - Feb 29 , 2024 | 07:21 PM
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్టు మ్యాచ్‌తో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌లో 100 టెస్టు మ్యాచ్‌లు పూర్తి చేసుకోబోతున్నాడు. దీంతో 100 టెస్టులు ఆడిన 14వ భారత క్రికెటర్‌గా నిలవబోతున్నాడు.
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్టు మ్యాచ్‌తో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌లో 100 టెస్టు మ్యాచ్‌లు పూర్తి చేసుకోబోతున్నాడు. దీంతో 100 టెస్టులు ఆడిన 14వ భారత క్రికెటర్‌గా నిలవబోతున్నాడు. అయితే తన వందో టెస్టులో అశ్విన్ ఓ అరుదైన రికార్డును సాధించే అవకాశాలున్నాయి. అది కూడా దిగ్గజ స్పిన్నర్లు అనిల్ కుంబ్లే, షేన్ వార్న్ రికార్డులను అధిగమించి కావడం గమనార్హం. తన 99 టెస్టుల కెరీర్‌లో రవిచంద్రన్ అశ్విన్ మూడో ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 12 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. టెస్టు క్రికెట్‌లో మూడో ఇన్నింగ్స్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టీమిండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్‌తో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు.
దీంతో ధర్మశాల టెస్టు మూడో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు తీస్తే కుంబ్లే, షేన్ వార్న్‌ను అధిగమించనున్నాడు. తన వందో టెస్టులో అశ్విన్ ఈ రికార్డును చేరుకుంటే ప్రత్యేకంగా నిలిచిపోనుంది. మూడో ఇన్నింగ్స్‌లో 21 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసిన శ్రీలంక మాజీ స్సిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అశ్విన్ సత్తా చాటుతున్నాడు. ముగిసిన 4 టెస్టుల్లో 17 వికెట్లు తీశాడు. మొత్తంగా తన కెరీర్‌లో ఇప్పటివరకు ఆడిన 99 టెస్టుల్లో అశ్విన్ 35 సార్లు 5 వికెట్లు తీశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 8 సార్లు 10 వికెట్లు తీశాడు. కాగా మార్చి 7 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.