Home » IndiaVsEngland
మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ జోరుగా కొనసాగుతున్న సమయంలో ఇంకొంచెం సేపు అయితే మూడో రోజు ఆట ముగుస్తుందనే సమయంలో యశస్వీ జైస్వాల్ గాయపడ్డాడు.
మూడో టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా కుర్రాళ్లు యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్ కుమ్మేశారు. మెరుపు సెంచరీతో జైస్వాల్ విధ్వంసం సృష్టించగా.. హాఫ్ సెంచరీతో గిల్ చెలరేగాడు. దీంతో రాజ్‌కోట్ టెస్టుపై టీమిండియా పట్టు బిగించింది.
మూడో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విధ్వంసం సృష్టించాడు. వన్డే తరహా బ్యాటింగ్‌తో దుమ్ములేపిన జైస్వాల్ 9 ఫోర్లు, 5 సిక్సులతో 122 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించాడు.
మూడో టెస్టులో మూడో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 44/1 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైస్వాల్(19), శుభ్‌మన్ గిల్(5) ఉన్నారు. 19 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మను జోరూట్ లెగ్‌బైస్‌లో పెవిలియన్ చేర్చాడు.
ఇంగ్లండ్‌తో మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుతంగా ఆడిన హిట్‌మ్యాన్ జట్టును ఆదుకున్నాడు.
ఇంగ్లండ్‌తో మొదలైన మూడో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సర్ఫరాజ్ ఖాన్ రనౌట్‌కు రవీంద్ర జడేజానే కారణమంటూ పలువురు మండిపడుతున్నారు.
ఇంగ్లండ్‌తో మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా చెలరేగారు. సెంచరీలతో దుమ్ములేపిన వీరిద్దరు నాలుగో వికెట్‌కు 204 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును వీరిద్దరు ఆదుకున్నారు.
ఇంగ్లండ్‌తో మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురయ్యాడు. డగౌట్‌లో తీవ్ర కోపంతో ఊగిపోయాడు. కోపాన్ని ఆపుకోలేక తలపై ఉన్న క్యాప్‌ను తీసి నేలకేసి కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. ఆడుతున్నది మొదటి మ్యాచే అయినప్పటికీ ఏ మాత్రం భయం లేకుండా వన్డే స్టైలులో బ్యాటింగ్ చేశాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ(131), లోకల్ బాయ్ రవీంద్ర జడేజా(110*) సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లండ్‌తో మొదలైన మూడో టెస్టులో తొలి రోజు ఆటలో టీమిండియా అధిపత్యం కొనసాగింది. రోహిత్, జడేజా సెంచరీలకు తోడు అరంగేట్ర బ్యాటర్ సర్ఫారాజ్ ఖాన్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు.