Home » Instagram
రాణా దుకాణాలలో దొరికే జెల్లీ ఫ్రూట్స్‌ను తినేందుకు చాలా మంది పిల్లలు ఇష్టపడతారు. ఆ ప్లాస్టిక్ కవర్లలో ఉండే తియ్యటి రసాన్ని చివరి చుక్క వరకు పీలుస్తుంటారు. చాలా రుచికరంగా అనిపించే ఆ జెల్లీలను కొనుక్కునేందుకు పిల్లలు ఎగబడతారు. అయితే ఆ జెల్లీలు ఎలా తయారవుతాయో మీకు తెలుసా?
సాధారణంగా మనషులు, జంతువుల మధ్య అనుబంధం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనుషులు పెంచుకునే కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులు బాగా మచ్చిక అవుతాయి. మనుషులపై ప్రేమను కురిపిస్తాయి. కానీ, క్రూర జంతువులతో మనుషులకు అటాచ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది.
ఓ వ్యక్తి తన ప్రతిభతో సైకిల్ ను కారుకు ధీటుగా మార్చేశాడు. అతని ఆవిష్కరణ చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
కుర్రాళ్లకు బైకులంటే తెగ వ్యామోహం. గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా పర్వాలేదు కానీ బైకు ఉండాలని మాత్రం కోరుకుంటారు.. ఓ కుర్రాడు తన ఖరీదైన బైక్ మీద స్టంట్ చేయబోతే జరిగిందిదీ..
డబ్బు అందుబాటులోకి రాకముందు వస్తు మార్పిడి విధానం అమలులో ఉండేది. మనకు ఓ వస్తువు కావాల్సి వచ్చినపుడు అంతే విలువైన వస్తువుతో కొనుగోలు చేసుకునే విధానం అమలులో ఉండేది. రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీల మధ్య వస్తువులు లేదా సేవల వ్యాపారం డబ్బు లేకుండానే జరిగిపోతుండేది.
స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అంటేనే పిల్లలు భయపడిపోతారు. ఎందుకంటే పేరెంట్స్ మీటింగ్‌లో టీచర్లు పిల్లల జాతకం మొత్తాన్ని తల్లిదండ్రుల ముందు విప్పుతారు. సరిగ్గా చదవడం లేదని, క్రమశిక్షణ లేదని, ప్రవర్తన బాగోలేదని.. ఇలా కంప్లైంట్లు చేస్తారు. అలాగే తమ పిల్లల గురించి తల్లిదండ్రులు టీచర్లకు ఫిర్యాదులు చేస్తారు.
ఢిల్లీ వాసులు మెట్రో రైలును కేవలం ప్రయాణాల కోసం మాత్రమే కాకుండా తమ పాపులారిటీని పెంచుకునేందుకు కూడా ఉపయోగించుకుంటున్నారు. కదులుతున్న రైలులో డ్యాన్స్‌లు చేయడం, స్టంట్లు చేయడం, రొమాన్స్ సాగించడం వంటి పనులు చేస్తూ వాటిని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
మన ఇంటి చుట్టు పక్కల రోజూ కనిపించే కాకులన పెద్దగా పట్టించుకోం. కాకులను అశుభాలకు సూచనగా పరిగణిస్తాం. కాకి అరిస్తే చుట్టాలు వస్తారని అపోహ పడుతుంటాం. పారిశుధ్య కార్మికులుగా కాకులు చేస్తున్న మంచిని పట్టించుకోం. మిగతా పక్షుల గురించి ఆలోచించినట్టు కాకుల గురించి ఆలోచించం.
పెళ్లి అనేది ఎవరి జీవితంలోనైనా అతి ముఖ్యమైన కార్యక్రమం. వధూవరుల కుటుంబాలు తమ బడ్జెట్‌కు అనుగుణంగా వివాహ వేడుక కోసం ఏర్పాట్లు చేస్తారు. బంధువులు, స్నేహితులను వివాహ వేడుకకు ఆహ్వానించి తమకు వీలైనంతలో వేడుక నిర్వహిస్తారు. అతిథులకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తారు.
నీటిలో ఉన్నప్పుడు మొసలిని మంచిన బలశాలి మరొకరు ఉండరు. నీటిలో ఏదైనా జంతువు మొసలి నోటికి చిక్కితే అది ముక్కలు కావాల్సిందే. ఎంతో అదృష్టం ఉంటే తప్ప నీటిలోని మొసలికి చిక్కి ప్రాణాలతో బయటపడడం జరగని పని.