Viral Video: ఈ సైకిల్ ఓనర్ ట్యాలెంట్ మాములుగా లేదుగా.. కారుకు ధీటుగా ఇతను క్రియేట్ చేసిందేంటో చూస్తే అవాక్కవడం ఖాయం..

ABN , First Publish Date - 2023-08-20T13:43:50+05:30 IST

ఓ వ్యక్తి తన ప్రతిభతో సైకిల్ ను కారుకు ధీటుగా మార్చేశాడు. అతని ఆవిష్కరణ చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

Viral Video: ఈ సైకిల్ ఓనర్ ట్యాలెంట్ మాములుగా లేదుగా.. కారుకు ధీటుగా ఇతను క్రియేట్ చేసిందేంటో చూస్తే అవాక్కవడం ఖాయం..

'దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు' అని తెలుగుబాల శతక కర్త ఏనాడో విద్య గురించి రాశారు. విద్య అంటే కేవలం బడిలో చదువుకునేదే కాదు. మనిషిలో ఉన్న ప్రతిభ అంతా విద్యగానే చెప్పుకోబడుతుంది. ప్రతిభ మనిషిని కొత్త ఆలోచనల దిశగా నడుపుతూనే ఉంటుంది. భారతదేశంలో ఈ ప్రతిభకు కొదువ ఏమీ లేదు. ఓ వ్యక్తి తన ప్రతిభతో సైకిల్ ను కారుకు ధీటుగా మార్చేశాడు. అతని ఆవిష్కరణ చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అతని ప్రతిభను కొనియాడుతున్నారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

సైకిల్ మధ్యతరగతి, పేద కుటుంబాలలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీన్ని తొక్కాలంటే మాత్రం శ్రమతో కూడకున్నదే. కానీ ఈ కష్టం తెలియకుండా హాయిగా ప్రయాణం చేయడానికి ఓ సంగీత ప్రియుడు సరికొత్త ఆవిష్కరణ చేశాడు. ఎవరైనా కారు ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణ బడలిక తెలియకుండా మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకుని ప్రయాణాన్ని ఆస్వాదిస్తుంటారు. సైకిల్లో ప్రయాణం చేసేటప్పుడు అలాంటి సౌకర్యం ఉండదు. కానీ కేరళకు(Kerala) చెందిన ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. సైకిల్ కు డీజే సిస్టమ్ సెట్ చేసి భళా అనిపించాడు(DJ system set in cycle). వీడియోలో ఓ వ్యక్తి డీజే సిస్టమ్ సెట్ చేసిన సైకిల్ తో కనిపిస్తాడు. అతను తన సైకిల్ కు వెనుక స్టాండ్ భాగంలో శక్తివంతమైన 6స్పీకర్ల బాక్స్ ను సెట్ చేశాడు. ఇది పనిచేయడానికి దీనిమీద బ్యాటరీ కూడా అమర్చాడు. ఇక మ్యూజిక్ ఆపరేట్ చేయడానికి సైకిల్ ముందు భాగంలో ఉండే రాడ్ కు కింద భాగంలో చెక్క పలక బిగించి దానికి మ్యూజిక్ చేంజ్ చేయడం నుండి కంట్రోల్ చేయడం వరకు అన్ని సెట్ చేశాడు. ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తోంది. ఇది కేరళ వ్యక్తి ఆవిష్కారం అని చెబుతున్నారు.

Hair vs Oil: జుట్టుకు నూనె రాసుకునే అలవాటు అస్సలు లేదా..? అయితే ఈ వార్తను తప్పక చదవాల్సిందే..!



ఈ వీడియో iamautomotivecrazer అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ ఆవిష్కరణ చూసిన సైకిల్ ప్రియులు ఫిదా అవుతున్నారు. 'అధిరిపోయింది' అని ఒకరు కామెంట్ చేశారు. 'అతను తన హాబీని క్రియేటీవ్ గా మార్చాడు. చాలామంది అలవాటే గొప్ప ప్రతిభకు పునాది అవుతుంది' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'బ్యాటరీ ఇంకొంచెం పెద్దగా ఉంటే ఇంకా బాగుంటుంది' అని మరొకరు అన్నారు.'ఈ సైకిల్ డీజే సిస్టమ్ ముందు కారు మ్యూజిక్ సిస్టమ్ కూడా దిగదుడుపే'అని మరికొందరు అంటున్నారు. మొత్తానికి ఈ సైకిల్ మీద డీజే అందరినీ చాలా ఆకట్టుకుంది.

Viral Video: ఇంటిలోపల ఓ కుర్రాడి వింత నిర్వాకం.. బైక్ స్టంట్ చేయబోతే ఏం జరిగిందో మీరే చూడండి..


Updated Date - 2023-08-20T13:43:50+05:30 IST