Viral Video: ఈ కుర్రాడు ఎంత తెలివైనవాడు.. టీచర్ దగ్గర ఎలా మాట్లాడాలో తండ్రికే నేర్పుతున్నాడు.. క్యూట్ వీడియో వైరల్!
ABN , First Publish Date - 2023-08-19T10:17:57+05:30 IST
స్కూల్‌లో పేరెంట్స్ మీటింగ్ అంటేనే పిల్లలు భయపడిపోతారు. ఎందుకంటే పేరెంట్స్ మీటింగ్‌లో టీచర్లు పిల్లల జాతకం మొత్తాన్ని తల్లిదండ్రుల ముందు విప్పుతారు. సరిగ్గా చదవడం లేదని, క్రమశిక్షణ లేదని, ప్రవర్తన బాగోలేదని.. ఇలా కంప్లైంట్లు చేస్తారు. అలాగే తమ పిల్లల గురించి తల్లిదండ్రులు టీచర్లకు ఫిర్యాదులు చేస్తారు.
స్కూల్ (School)లో పేరెంట్స్ మీటింగ్ (Parents Meeting) అంటేనే పిల్లలు భయపడిపోతారు. ఎందుకంటే పేరెంట్స్ మీటింగ్‌లో టీచర్లు పిల్లల జాతకం మొత్తాన్ని తల్లిదండ్రుల ముందు విప్పుతారు. సరిగ్గా చదవడం లేదని, క్రమశిక్షణ లేదని, ప్రవర్తన బాగోలేదని.. ఇలా కంప్లైంట్లు చేస్తారు. అలాగే తమ పిల్లల గురించి తల్లిదండ్రులు టీచర్లకు ఫిర్యాదులు చేస్తారు. దీంతో టీచర్లు, తల్లిదండ్రులు కలుస్తున్నారంటే పిల్లలకు దడ మొదలవుతుంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి (Viral News).
తమ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలని, వారి మనసు కష్టపెట్టకూడదని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో పిల్లలు తమ మనసులో మాటను ధైర్యంగా పేరెంట్స్‌కు చెబుతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video)చూస్తే నేటి పిల్లల పరిస్థితి అర్థమవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుర్రాడి తండ్రి మరుసటి రోజు పేరెంట్స్ మీటింగ్‌కు హాజరవుతున్నాడు. పేరెంట్స్ మీటింగ్‌లో ఏం మాట్లాడాలో తండ్రికి ఆ కుర్రాడు చెబుతున్నాడు. ``నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక బిస్కెట్లు తింటానని చెప్పకండి. కిచిడీ తిని నిద్రపోతానని చెప్పండి`` అంటున్నాడు.
Viral Video: జనాలతో నిండిపోయిన ఢిల్లీ మెట్రోలో యువతి సూపర్ స్టంట్.. ఫైర్ అవుతున్న నెటిజన్లు!
కుర్రాడి మాటలకు తండ్రి స్పందిస్తూ.. ``నేనెందుకు అబద్ధం చెప్పాలి. నువ్వసలు కిచిడీ తినవు. బోలెడన్ని స్నాక్స్ తింటావు`` అంటున్నాడు. టీచర్‌తో అలా చెప్పొద్దని ఆ కుర్రాడు అంటున్నాడు. cheekuthenoidakid అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. 50 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ``ఈ కుర్రాడు చాలా స్మార్ట్``, ``ఇప్పటి పిల్లలకు వయసుకు మించిన జ్ఞానం ఉంది``, ``పిల్లలతో తల్లిదండ్రులు స్నేహంగా ఉండడం కరక్టేనా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.