Home » International News
అడాల్ఫ్ హిట్లర్ అనే ఓ నియంత ఉండేవాడని గతంలో మనం పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ కిమ్ జంగ్ ఉన్ అనే నియంతను మనం నేడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఉత్తర కొరియా నియంతగా కిమ్ జంగ్ ఉన్ తీసుకుంటున్న నిర్ణయాలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
ఉక్రెయిన్, రష్యా మధ్య రెండున్నరేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
న్యూయార్క్‌లో భారతీయ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు భారతదేశం వెనుకబడి లేదని, కొత్త వ్యవస్థలను తయారు చేసి నడిపిస్తుందని అన్నారు. దీంతోపాటు భారతదేశం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానని వ్యాఖ్యానించారు.
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా మార్క్సిస్టు నేత అనురా కుమార దిసానాయకే నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమార దిసానాయకే తన సమీప ప్రత్యర్థి సజిత్ ప్రేమదాసపై విజయం సాధించారు.
శ్రీలంకంలో 2022లో తలెత్తిన ఆర్థిక మాంద్యం తర్వాత జరిగిన అధ్యక్ష ఎన్నికలు ఇవే కావడంతో ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. శనివారంనాడు అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్ జరగగా, 76 శాతం ఓటింగ్ నమోదైంది. వెంటనే ఫలితాలు లెక్కించారు. 42.31 శాతం ఓట్లతో మార్క్సిస్ట్ నేత దిసానాయకే గెలుపొందారు.
తూర్పు ఇరాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకైంది. దీంతో భారీ పేలుడు సంభవించి 30 మంది మరణించారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ మీడియా సమాచారం ఇచ్చింది.
అగ్రరాజ్యం అమెరికాలో క్వాడ్ సమ్మిట్ థీమ్ ఈసారి క్యాన్సర్ మూన్‌షాట్‌పై నిర్వహించారు. ఈ క్రమంలో క్యాన్సర్‌పై పోరాటానికి ప్రపంచ నేతలంతా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన భారత ప్రధాని మోదీ గర్భాశయ క్యాన్సర్ విషయంలో కీలక ప్రకటనలు చేశారు.
రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని, దీనికి భారత్ చొరవ చూపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కోరారు. మోదీ-బైడెన్ మధ్య శనివారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా.. ఇరువురు నేతలు పలు అంశాలపై మాట్లాడారు.
చట్టబద్ధ శాశ్వత నివాస హోదాను సూచించే గ్రీన్ కార్డు చెల్లుబాటు కాలాన్ని పొడిగిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 24 నెలల కాలాన్ని 36 నెలలకు పెంచింది.
మోదీ అమెరికాలో అడుగుపెట్టే కొన్ని గంటల ముందే కీలక పరిణామం జరిగింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ఖలీస్థానీ మద్దతుదారులు, సిక్కు వేర్పాటువాద నాయకులతో కీలక సమావేశం జరిపింది.