Home » IPL 2024
ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లి దురుసు ప్రవర్తన నేపథ్యంలో మ్యాచ్ ఫీజులతో కోత విధించారు. నిన్న కోల్ కతాతో జరిగిన మ్యాచ్‌లో ఔటయిన తర్వాత కోహ్లి అంపైర్లతో వాదనకు దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత థర్డ్ ఎంపైర్ కూడా ఔట్ ఇవ్వడంతో ఆగ్రహంతో పెవిలియన్ చేరాడు.
పంజాబ్ కింగ్స్ లెవెన్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్ ప్రదర్శనపై డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అటు బౌలర్‌గనూ, ఇటు బ్యాటర్‌గానూ రాణించడం లేదని, అతడికి తుది జట్టులో ఉండే అర్హతే లేదని సెహ్వాగ్ మండిపడ్డాడు.
ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ జరుగుతోంది. కొన్ని జట్లు వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాయి. మరికొన్ని అపజయాలతో డీలా పడుతున్నాయి. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని జట్లుగా బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్, లఖ్‌నవూ నిలిచాయి. స్టార్ క్రికెటర్లు ఉన్నా ఈ నాలుగు జట్లు ఒక్కసారి కూడా కప్ కొట్టలేదు.
నేడు ఐపీఎల్ 2024లో 38వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదటి స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ జట్టు ఆరో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో ఇప్పుడు చుద్దాం.
చివరి బంతి వరకు ఉత్కంఠ నెలకొంది. ఒక పరుగు తేడాతో కోల్ కతా జట్టు విజయం సాధించింది. లాస్ట్ వరకు నువ్వా నేనా అన్నట్టు ఆర్సీబీ వర్సెస్ కోల్ కతా మ్యాచ్ సాగింది. చివరలో దినేష్ కార్తీక్ ఔటవ్వడంతో ఓటమి ఖాయం అని ఆర్సీబీ అభిమానులు భావించారు. కరణ్ శర్మ రూపంలో ఆపద్బాంధవుడు దొరికాడు అనిపించింది. అతను చెలరేగి ఆడటంతో మ్యాచ్ గెలిపిస్తాడని భావించారు. స్టార్క్‌కు స్ట్రెయిట్ క్యాచ్ ఇచ్చి కరణ్ శర్మ ఔటవ్వంతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
అంపైర్లపై విరాట్ కోహ్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్ కతా నైట్ రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి తీవ్ర ఆవేశానికి గురయ్యాడు. 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హర్షిత్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో ఆర్సీబీ తరఫున కోహ్లి రివ్యూ తీసుకున్నాడు. అయినప్పటికీ కోహ్లి ఔట్ అయినట్టు అంపైర్ ప్రకటించాడు.
ఐపీఎల్‌లో పరుగుల వరద పారుతోంది. ఏ జట్టు అయినా సరే కనీసం 200 పరుగులు చేస్తోంది. ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్య 36వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది.
కోల్‌కతా: ఐపీఎల్ 2024లో (IPL 2024) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు దారుణంగా విఫలమవుతోంది. ఆ జట్టులో ఇద్దరే ఇద్దరు ఆటగాళ్లు రాణిస్తుండగా అందులో ఒకరు దినేశ్ కార్తీక్ (Dinesh Karthik). జట్టు ఎంత ఘోరంగా విఫలమవుతున్నా డీకే మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ ప్రదర్శన చేస్తున్నాడు. మరోపక్క వికెట్ కీపర్‌గానూ రాణిస్తున్నాడు.
మరికొన్ని రోజుల్లోనే టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న తరుణంలో.. ఒకవైపు భారత సెలక్టర్లు జట్టుని ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉండగా, మరోవైపు ఆటగాళ్లు జట్టులో స్థానం పొందేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఐపీఎల్-2024లో (IPL 2024) ఉత్తమ ప్రదర్శన కనబరిచి..
శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స హైదరాబాద్ మరోసారి భారీ స్కోరు సాధించింది. డీసీ బౌలర్లను ట్రావిస్ హెడ్ (89), అభిషేక్ శర్మ (46) ఊచకోత కోశారు.